టీజర్: టీజర్ తోనే అరాచకం సృష్టిస్తున్న నరేష్- పవిత్ర లోకేష్..!!

గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి నటుడు వీకే నరేష్ నటి పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారని వార్తలు ఎక్కువగా వినిపించాయి. ముఖ్యంగా వీరిద్దరూ వివాహం చేసుకొని ఒకటవుతున్నారని విషయాన్ని కూడా తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా అదంతా కేవలం మళ్లీ పెళ్లి అనే సినిమా కోసమే చేశారన్నట్లుగా వార్తలు వినిపించాయి. తాజాగా ఈ రోజున ఈ సినిమా టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. తెలుగు, కన్నడ భాషలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.

Malli Pelli Teaser: Lovely Suspense

వీకే నరేష్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అతని మూడో పెళ్లి కథని ఈ సినిమా కథగా తెరకెక్కిస్తున్నారు. టీజర్ మొదట్లో డాక్టర్ నరేష్ వికె 50 గోల్డెన్ ఇయర్స్ అంటూ ఇంట్రడక్షన్ చేయడం జరిగింది ఆ తర్వాత నరేష్ అటు పవిత్ర లోకేష్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని ముచ్చటగా మూడోసారి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే వీళ్ళ పెళ్లికి ముందు నరేష్ రెండవ భార్య చేసిన గొడవ ట్విస్టులు తెగ వైరల్ గా మారాయి.

Naresh Pavitra Lokesh Malli Pelli Movie Teaser Released Today, Video Viral  - Sakshi

ఇక వీరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను మళ్లీ పెళ్లి అని టీజర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా నరేష్ వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం మాత్రం ఎమ్మెస్ రాజు వ్యవహరిస్తున్నారు ఇప్పటికే మళ్ళీ పెళ్లి సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా వైరల్ గా మారాయి. తాజాగా ఈ సినిమా టీజర్ తో మరొకసారి మేకర్స్ ఆసక్తి పెంచేశారు.

నరేష్, పవిత్ర రొమాన్స్ కూడా ఈ సినిమాలో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. చివరిలో కన్నులతో సైగలు చేసుకుంటూ ఉండడం గమనార్హం.ఈ సినిమాలో జయసుధ, శరత్ బాబు, అనన్య నాగళ్ళ ముఖ్యమైన పాత్రలో వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ వైరల్ గా మారుతోంది.