నటుడు మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం..!!

మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ఇంట తీవ్రమైన విషాద ఛాయలు నెలకొన్నాయి.. మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ తాజాగా కన్ను మూసినట్టుగా తెలుస్తోంది.గత కొన్నేళ్లుగా ఈమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈమె వయసు ప్రస్తుతం 93 సంవత్సరాలు ఈమె కోచ్చి లోని ఒక ప్రైవేటు హాస్పటల్లో చికిత్స పొందుతూ మరణించినట్లుగా సమాచారం. దీంతో మమ్ముట్టి ఇంట తీవ్రమైన విషాద ఛాయలు అలుముకున్నాయి.

Malayalam actor Mammootty's mother Fatima Ismail passes away - Sakshi

మమ్ముట్టి తల్లి మరణంతో అతను చాలా కృంగిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఫాతిమా ఇస్మాయిల్ అంత్యక్రియలు కూడా ఈరోజు సాయంత్రం జరగబోతున్నట్లు తెలియజేశారు. ఈ విషయం తెలియడంతో అభిమానులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖుల సైతం ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేస్తున్నారు.. మమ్ముట్టి విషయానికి వస్తే మలయాళంలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకొని తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటున్నారు.

మమ్ముట్టి స్వాతికిరణం, దళపతి వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ మధ్యకాలంలో మలయాళం లో నటించిన సినిమాలను కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు.మమ్ముట్టి మరో వారం రోజుల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది అనే లోపే మమ్ముట్టి ఇంట తీవ్రమైన విషాద ఛాయలు నెలకొనడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. మహానటి సినిమాలో కూడా నటించి బాగానే పేరు సంపాదించారు. అలా సీతారామం చిత్రంలో కూడా రాంగ్ గా అలరించి బాగా ఆకట్టుకున్నారు ప్రస్తుతం తెలుగులో మరొక సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.