సిక్స్ ప్యాక్ తో షాకిచ్చిన తాప్సీ.. ఆమె ముందు హీరోలు కూడా దిగ‌దుడుపే!

హీరోలు, విలన్లు సిక్స్ ప్యాక్ చెయ్యడం సర్వసాధారం. ఫర్ ఏ చేంజ్.. ఒక హీరోయిన్ సిక్స్ ప్యాక్ తో షాకిచ్చింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు తాప్సీ. మొద‌ట సౌత్ లో స్టార్ హోదాను అందుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. ఆ త‌ర్వాత బాలీవుడ్ కు మ‌కాం మార్చింది. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు చేస్తూ అక్క‌డ కూడా స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది.

ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా బాలీవుడ్ లో త‌న‌కంటూ స్పెష‌ల్ మార్కెట్ ను క్రియేట్ చేసుకుంది. అయితే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉంటే తాప్సీ.. తాజాగా ఆరు ప‌ల‌క‌ల దేహంతో ద‌ర్శ‌న‌మిచ్చింది. జిమ్ ట్రైనర్ తో కలిసి తన కండలు తేలిన బాడీని ఎక్స్ పోజ్ చేసింది.

గ్లామర్ గా కనిపించే తాస్పి ఇలా సిక్స్ ప్యాక్స్ తో కనిపించడంతో అంతా షాకైపోతారు. అభిమానులు అయితే తాప్సీ ముందు కొంద‌రు హీరోలు కూడా దిగ‌దుడుపే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, తాప్సీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కు జోడీగా ‘డుంకీ’ సినిమాలో న‌టిస్తుంది. అలాగే ‘నామ్ షబానా’ సీక్వెల్ చెయ్యడానికి కూడా రెడీ అయ్యింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది.