ఇలియానా ప్రెగ్నెన్సీకి ఆ స్టార్ హీరోయిన్ సోద‌రుడే కార‌ణ‌మా?

ప్ర‌ముఖ హీరోయిన్ ఇలియానా త్వ‌ర‌లో త‌ల్లి కాబోతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా త‌న ప్రెగ్నెన్సీ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా ఇలియానా అనౌన్స్ చేసింది. అయితే అంద‌రికీ తెలుసు.. ఇలియానాకు ఇంకా పెళ్లి కాలేదు. గ‌తంలో ఆమె ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమ‌లో ప‌డింది.

 

అత‌డితో కొన్నాళ్లు స‌హ‌జీవ‌నం కూడా చేసింది. అయితే వీరిద్ద‌రూ పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే బ్రేక‌ప్ చెప్పుకున్నారు. ఆండ్రూతో విడిపోయిన త‌ర్వాత ఇలియానా మ‌ళ్లీ కెరీర్ పై ఫోక‌స్ పెట్టింది. కానీ, ఆఫ‌ర్లు మాత్రం అంతంగా మాత్రంగానే మారాయి. అయితే ఇలాంటి త‌రునంలో ఇలియానా త‌న ప్రెగ్నెన్సీని ప్ర‌క‌టించింది. వివాహం కాకుండానే ఆమె ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది.

అయితే ఇలియానా ప్రెగ్నెన్సీకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ కార‌ణం అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్ద‌రూ డేటింగ్ లో ఉన్నారంటూ గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవల అతను ఎక్కడ ఉన్నా కూడా ఇలియానా వెంటనే అక్కడ వాలిపోయేది. దీంతో ఇప్పుడు ఇలియానాకు పుట్ట‌బోయే బిడ్డ‌కు సెబాస్టియన్ నే తండ్రి అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరీ ఆ బిడ్డ వీళ్లద్దరికి పుట్టబోయే బిడ్డేనా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.