సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ నెల జీతం ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!

సాధార‌ణంగా స్టార్ సెల‌బ్రెటీస్ బాడీగార్డ్స్ లేకుండా ప‌బ్లిక్ లోకి రానేరావు. అందులోనూ థ్రెట్ ఉన్న‌వారైతే బ‌య‌ట కాలు పెడితే వెంట బాడీగార్డ్ ఉండాల్సిందే. ఈ జాబితాలో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఒక‌రు. ఇటీవ‌ల ఈయ‌న‌కు చంపుతామంటూ పలు ఫోన్ కాల్స్, లెటర్స్, మెయిల్స్ వ‌స్తున్నాయి.

ముఖ్యంగా పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలేను కాల్చిచంపిన బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు ముప్పు పెరుగుతోంది. సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్స్ కూడా రావడంతో ఆయ‌న‌కు కేంత్ర ప్ర‌భుత్వం వై ప్లస్ కేటగిరీ కింద అదనపు భద్రత కల్పించింది. అలాగే గత పాతిక సంవత్సరాలుగా షేరా అనే వ్యక్తి సల్మాన్‌కు బాడీ గార్డ్‌గా వ్యహరిస్తున్నాడు.

సల్మాన్ ఖాన్‌కు నిరంతరం రక్షణ ఇస్తూ.. ఆయ‌న‌కు అత్యంత నమ్మకస్థుడిగా పేరొందాడు. సల్మాన్‌ఖాన్‌కి బాడీగార్డ్‌గా ఉండటం వల్ల షేరా అందుకునే జీతం తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు. నెలకు దాదాపు రూ. 15 లక్షల రేంజ్ లో షేరా జీతం పుచ్చుకుంటాడు. అంతేకాదు, టైగర్ సెక్యూరిటీ సర్వీసెస్ స్టాపించిన షేరా.. త‌న కంపెనీ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హై-ప్రొఫైల్ సెలబ్రిటీలకు భద్రతను అందిస్తుంటాడు. ఈ కాంపెనీ ద్వారా షేరాకు భారీ ఇన్‌క‌మ్ వ‌స్తుంటుంది.