శ్రీలీల జీవితంలో పెద్ద దోషం.. ఇక అమ్మడి కెరీర్ ఫినిష్?

రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి శ్రీలీల. తన నటనతో అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఉన్న యూత్‌ని మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు అంటే ఎక్కువమంది శ్రీలీల పేరు చెబుతారు. ఈ అమ్మడు యంగ్ హీరోలతోనే కాకుండా తండ్రి వయసు ఉన్న హీరోలతో కూడా నటిస్తూ తన సత్తా చాటుకుంటుంది.

ఇటీవల రవితేజ నటించిన ‘ధమాకా’ సినిమాలో శ్రీలీల తన నటనతో అదరగొట్టేసిందనే చెప్పాలి. ఈ సినిమాలో రవితేజకి మించి స్టెప్పులు వేసి ప్రేక్షకులను అలరించిందీ అమ్మడు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఐదారు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం శ్రీలీలకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే శ్రీలిలకి దోషం ఉందని, ఆ దోషం కారణంగా శ్రీలీల సినీ కెరీర్‌ నాశనం అవుతుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అసలు విషయంలోకి వెళితే శ్రీలీలకి సినీ కెరీర్ కలిసి రాదని ముందుగానే తెలుసట. కానీ ఈ అమ్మడుకు సినిమాలపై ఇష్టంతో తన తల్లి మాట కూడా వినకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందట. అంతేకాకుండా వచ్చే ఐదేళ్లలో శ్రీలీల సినీ కెరీర్ ముగిసిపోతుందనే పుకార్లు కూడా సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్నాయి. అసలు ఈ వార్తలో ఎంత నిజం ఉందొ ఎంత అబద్ధం ఉందో అనేది మాత్రం ఎవరికి తెలీదు. కాగా శ్రీలీల అభిమానులు మాత్రం ఈ విషయం విని చాలా బాధపడుతున్నారు.