`రావణాసుర` ట్విట్ట‌ర్ టాక్.. ర‌వితేజ‌కు హ్యాట్రిక్ ద‌క్కేనా?

ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య చిత్రాల‌తో డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందుకున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. నేడు `రావ‌ణాసుర‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫ‌రియా అబ్దుల్లా, ద‌క్షా న‌గార్క‌ర్‌, పూజిత పొన్నాడ హీరోయిన్లు గా న‌టించాడు. హీరో సుశాంత్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించాడు.

క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే ప్రీమియర్ షోలు చూసిన నెటిజ‌న్లు ట్విట్ట‌ర్ ద్వారా త‌మ‌దైన శైలిలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. అయితే చాలా వ‌ర‌కు పాజిటివ్ రివ్యూలు రావ‌డం విశేషం. లాయ‌ర్ అయిన హీరో క్రిమిన‌ల్ గా మారితే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో ఈ మూవీని రూపొందించారు. రవితేజ క్యారక్టరైజేషన్ సూప‌ర్ గా ఉంద‌ని, కంప్లీట్ నెగిటివ్ షేడ్స్ లో ఆయ‌న అద‌ర‌గొట్టేశార‌ని అంటున్నారు. ఫ‌స్టాఫ్ కాస్త స్లోగా ఉన్నా.. సెకండ్ హాఫ్ దుమ్ము రేపింద‌ని అంటున్నారు.

 

ముఖ్యంగా ఇంట్రవెల్ ట్విస్ట్ అదరగొట్టారంటూ ట్వీట్ చేస్తున్నారు. కండ‌ఫ్ మొత్తం ప్ర‌తి ప‌ది నిమిషాల‌కో ట్విస్ట్ వ‌చ్చి ప్రేక్ష‌కుల్ని స‌ర్‌ప్రైజ్ చేస్తాయ‌ని, బీజీఎమ్ నెక్స్ట్ లెవ‌ల్ అని చెబుతున్నారు. హీరోయిన్లు ఐదుగురు ఉన్నా వారి పాత్ర‌ల‌కు పెద్ద‌గా ప్ర‌ధాన్య‌త లేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. సుశాంత్ పాత్రపై కొంద‌రు పాజిటివ్ గా స్పందిస్తే.. మ‌రికొంద‌రు పెద‌వి విరిస్తున్నారు. ఫైన‌ల్ గా ఫ్యాన్స్ కి రావ‌ణాసుర విజువ‌ల్ ట్రీట్ లా ఉంటుంద‌ని అంటున్నారు. రవితేజకు మరో బ్లాక్ బస్టర్ ఖాయ‌మ‌ని ఎక్కువ శాతం మంది ట్వీట్స్ చేస్తున్నారు.

https://twitter.com/vallepuraghav/status/1644082558576242688?s=20