న‌గ్మాతో సీక్రెట్ ఎఫైర్‌.. హాట్ టాపిక్ గా మారిన `రేసుగుర్రం` విల‌న్ కామెంట్స్‌!

నేను కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటూ బిగ్ బాంబ్ పేల్చి ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచిన ప్ర‌ముఖ న‌టుడు, బీజేపీ ఎంపి ర‌వి కిషన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన ‘రేసుగుర్రం’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. ఇందులో ‘మద్దాలి శివారెడ్డి’ పాత్రలో అద‌ర‌గొట్టి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు.

భోజ్‌పురిలో సీనియర్ నటుడైన రవికిషన్ హిందీ, తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలో నటించి త‌న‌కంటూ ప్ర‌త్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక‌పోతే గ‌తంలో సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ నగ్మాతో ర‌వి కిష‌న్ సీక్రెట్ ఎఫైర్ న‌డిపించాడ‌నే టాక్‌ ఉంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ర‌వి కిష‌న్‌కు ఈ విష‌యంపై ఓ ప్ర‌శ్న ఎదురైంది. న‌గ్మాతో మీకు ఎఫైర్ ఉండేదా..? అని హోస్ట్ ర‌వి కిష‌న్ ను ప్ర‌శ్నించ‌గా.. ఆయ‌న చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

`నగ్మాతో ఎక్కువ సినిమాలు చేయడం వల్లే అలాంటి రూమర్స్ సృష్టించారు. నిజానికి మేమిద్దరం మంచి స్నేహితులు. నగ్మాతో నేను చాలా సినిమాలు చేశాను. మా సినిమాల్లో బ్లాక్ బ‌స్టర్లుగా కూడా నిలిచాయి. ఇక నాకు పెళ్లైన విషయం అందరికీ తెలుసు. నేను నా భార్య ప్రీతి శుక్లాను చాలా గౌరవిస్తా. నా భార్య మొదటి నుంచి నాతోనే ఉంది. నా వద్ద డబ్బు లేనప్పుడు కూడా నా వెంటే నడిచింది. ప్రస్తుతం నా భార్య పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నాను` అంటూ రవి కిషన్ చెప్పుకొచ్చారు.