బాడీ షేమింగ్ పై హానీ రోజ్ రియాక్ష‌న్‌.. ఒక్కొక్క‌రికి ఇచ్చి ప‌డేసిందిగా!

హనీ రోజ్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన `వీర సింహారెడ్డి` మూవీతో హనీ రోజ్‌ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ చిత్రంలో బాలకృష్ణకు మ‌ర‌ద‌లిగా మరియు తల్లిగా నటించి ఆకట్టుకుంది. ఈ మూవీ ద్వారా టాలీవుడ్‌లో కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది.

తరచూ అదిరిపోయే ఫోటో షూట్ల‌తో భారీ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది. పైగా ఈ మ‌ధ్య ఎక్క‌డ చూసినా హ‌నీ రోజే క‌నిపిస్తోంది. ఓవైపు వరుస సినిమా ఆఫర్స్ తో పాటు షాపింగ్స్ ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. అయితే హ‌నీ రోజ్ ను ఆరాధించే వారే కాదు.. విమ‌ర్శించే వారు ఉన్నారు. ముఖ్యంగా ఆమె సోష‌ల్ మీడియాలో ఎక్కువ బాడీ షేమింగ్ కామెంట్స్ ను ఫేస్ చేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా ఓ షోరూం ఓపెనింగ్ లో పాల్గొన్న‌ హానీ రోజ్.. బాడీషేమింగ్ కామెంట్స్ పై రియాక్ట్ అవుతూ ఒక్కొక్క‌రికి ఇచ్చి ప‌డేసింది. `హీరోయిన్ బరువు పెరిగినా.. లేదా తగ్గినా ప్రజలు నిత్యం ఎగతాళి చేస్తూనే ఉంటారు, వారికి వేరే ప‌ని ఏమీ ఉండ‌దు. అయితే ఎవ‌రు ఎన్ని అన్నా నాకు న‌చ్చిన‌ట్లే నేను ఉంటాను. ఎలాంటి దుస్తులు ధరించాలి.. ఏవిధంగా రెడీ కావాలి అనేది నా ఇష్టం.` అంటూ ముక్కుసూటిగా చెప్పేసింది. అలాగే తనకు చీర అంటే ఇష్టమని.. కానీ అందులో నడవడమే కాస్త కష్టమని తెలిపింది. దీంతో హ‌నీ రోజ్ కామెంట్స్ కాస్త వైర‌ల్ గా మారాయి.