హాట్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న మెగా డాటర్ నిహారిక.. న్యూ పిక్స్ చూస్తే..

మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరపై హీరోయిన్‌గా మెరిసిన ఒకే ఒక అమ్మాయి నిహారిక అని చెప్పవచ్చు. మెగా బ్రదర్ నాగబాబుకి ఏకైక కుమార్తె అయిన నిహారిక టాప్ హీరోయిన్‌గా ఎదగాలని ఎంతో ఆశ పడింది. కానీ దురదృష్టం కొద్దీ ఆమె తన యాక్టింగ్ కెరీర్‌కి మూడేళ్లకే ముగింపు పలకాల్సి వచ్చింది. తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ కావడమే ఇందుకు కారణం. 2016లో ఈ ముద్దుగుమ్మ నాగశౌర్యతో కలిసి ‘ఒక మనసు సినిమా’ చేసింది. ఈ మూవీ ఎదురు తన్నింది.

తర్వాత నిహారిక నటించిన హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు సైతం నిరాశనే మిగిల్చాయి. తర్వాత హీరోయిన్ ఛాన్స్ ఈ ముద్దుగుమ్మను వరించలేదు. ఆఖరి సారిగా తన పెదనాన్న నటించిన సైరా నరసింహారెడ్డి లో ఓ కీలక పాత్ర పోషించింది నిహారిక. అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు పెద్దగా గుర్తింపు రాలేదు.

ప్రస్తుతానికి నటిగా నిహారిక కొనసాగకపోయినా వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ యాక్టింగ్ రంగంలోనే ఉంటోంది. జీ5 వెబ్ సిరీస్ అయిన హలో వరల్డ్ (2022)ని చివరిసారిగా నిహారిక ప్రొడ్యూస్ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఆఫర్స్ ఉన్నాయో లేదా తెలియ రాలేదు. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2020లో ఈ అందాల తార చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత కొద్ది రోజుల వరకుసోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది. ఆపై చాలా బ్రేక్ తీసుకుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కనిపించకపోవడంతో అనేక రూమర్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా ఆమె డివోర్స్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.  ఈ నేపథ్యంలోనే నిహారిక మళ్ళీ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి నిద్ర ఖరాబ్ చేస్తోంది. తాజాగా ఈ మెగా డాటర్ పర్పుల్ కలర్ శారీలో దర్శనం ఇచ్చి సెగలు పుట్టిస్తోంది. ఈ అమ్మడి ఫిగర్ నెటిజన్ల మతి పోగోడుతోంది.