మోహ‌న్ బాబు నిజ‌స్వ‌రూపం బ‌ట్ట‌బ‌య‌లు చేసిన మౌనిక‌.. మ‌నోజ్ ముందే ఓపెన్!

మంచు మ‌నోజ్‌, భూమా మౌనిక రెడ్డి ఇటీవ‌లే మూడు ముళ్ల బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రికీ ఇది రెండో వివామ‌మే. మౌనిక‌కు మొద‌టి భ‌ర్త ద్వారా ఒక కొడుకు కూడా ఉన్నాయి. అయితే ఇద్ద‌రి మ‌న‌సులు క‌ల‌వ‌డంతో మౌనిక‌, మ‌నోజ్ క‌లిసి ఏడ‌డుగులు వేశారు.

మంచు ల‌క్ష్మి నివాసంలో మార్చి 3వ తేదీన మనోజ్‌, మౌనిక పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అయితే రీసెంట్ గా ఈ నూత‌న జంట వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న `అలా.. మొద‌లైంది` అనే షోలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా త‌మ ప‌రిచ‌యం, ప్రేమ‌, పెళ్లి చేసుకునేందుకు ప‌డ్డ క‌ష్టాలు వారు వివ‌రించారు. ఈ క్ర‌మంలోనే మామ‌య్య మోహ‌న్ బాబు నిజస్వ‌రూపాన్ని భ‌ర్త మ‌నోజ్ ముందే బ‌ట్ట‌బ‌య‌లు చేసింది.

గ‌తంలో వీరిద్ద‌రి పెళ్లి మోహ‌న్ బాబుకు ఇష్టం లేద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, మ‌నోజ్-మౌనిక పెళ్లిని మోహ‌న్ బాబు ద‌గ్గ‌రుండి జ‌రిపించారు. తాజాగా మౌనిక అత్త‌య్య‌, మామ‌య్య‌ల‌తో త‌న రిలేజ్ కూడా మాట్లాడింది. `మామ‌య్య నాతో చాలా స‌ర‌ద‌గా ఉంటారు. పెళ్లి కాక‌ముందు ఇంటికి వెళ్లిన‌ప్పుడు ఆయ‌న స్వ‌యంగా నాకు భోజ‌నం తినిపించారు. అలాగే అత్త‌య్య ఎప్పుడూ నాతో ఫోన్ లో మాట్లాడూ ఉంటుంది. నాకు చాలా స‌పోర్ట్‌గా ఉంటుంది. న‌న్ను, నా కొడుకు ధైర‌వ్ ను వాళ్లిద్ద‌రూ సొంత‌వాళ్ల మాదిరిగా ద‌గ్గ‌ర‌కు తీసుకున్నారు. అత్త‌య్య‌, మామ‌య్య నాకు దేవుడిచ్చిన వ‌రం` అంటూ మౌనిక చెప్పుకొచ్చింది. దీంతో మౌనిక కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.