పేరు తప్పుగా పలికిన జర్నలిస్టు… మండిపడిన హీరోయిన్ కూతురు!

సినిమా సెలబ్రిటీలు అంటేనే అందరి చూపులు వారిమీదే ఉంటాయి. అలాంటిది మీడియా వాళ్లంటే ఊరుకుంటారా మరి? సినిమా హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాకుండా వారి కుటుంబం ఎక్కడ కనబడినా కొన్ని వందల కెమెరాలు క్లిక్ అంటాయి. ఇక అభిమానుల హడావుడి ఎలాగూ ఉంటుంది. ఈ క్రమంలో సెలబ్రిటీల పిల్లలు ఏ మాత్రం పొరపాటు చేసినా మనవాళ్ళు ఏకీపారేస్తూ ఉంటారు. అసలు విషయంలోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ దంపతులు అయినటువంటి అజయ్ దేవగన్, కాజోల్ కూతురు నిషా దేవగన్ విషయంలో తాజాగా ఓ చేదు అనుభవం చోటుచేసుకుంది.

నిషా దేవగన్ తాజాగా ఒక రెస్టారెంట్ కి వెళ్లిన తరువాత పని ముగించుకుని బయటకు వచ్చిన ఆమెను కొందరు కొంతమంది జర్నలిస్టులు ఫొటోలు తీయటం మొదలుపెట్టారు. దానికి నిషా దేవగన్ కూడా నవ్వుతూ

ఫోజులు ఇస్తూ వారి వైపు చూస్తూ అక్కడి నుంచి తన కారు ఉన్న చోటుకు నడవసాగారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఆమెని నైసా, నైసా అంటూ పిలవటం మొదలుపెట్టారు. ఆమె అవేవీ పట్టించుకోకుండా కారులోకి కూర్చుంది. అయినా వారు మళ్ళీ నైసా అని పిలవడంతో దానికి ఆమె కాస్త నొచ్చుకొని ఆ వెంటనే నా పేరు నిషా అంటూ నవ్వుతూ వారిపై అసహనం వ్యక్తం చేసింది. దీంతో వారు ఆమెకు సారీ కూడా చెప్పారు.

ఇకపోతే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆమెకి సపోర్ట్ గా నిలిచారు. ఆమె పేరు నిషా దేవగన్. నైసా కాదు. ఈసారన్నా ఆమె ఎక్కడైనా కనబడితే ఆమెని సరిగ్గా పిలవండి అని జర్నలిస్టులకు నెటిజన్లు సలహాలు చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే వీరికి ఎలాంటి పని ఉండదు.. సరదాగా బయటకి వద్దామన్న సెలిబ్రిటీలంటే వీరికి చులకన. వారి ప్రైవసీకి భంగం కలిగిస్తారు అని కామెంట్స్ చేస్తున్నారు.