జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి కి గుండెపోటు..!!

జబర్దస్త్ లో ఎంతోమంది కమెడియన్స్ సైతం ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అయ్యారు.అలాంటి వారిలో చలాకి చంటి కూడా ఒకరు. గతంలో ఎన్నో సినిమాలలో నటించిన జబర్దస్త్ షో ద్వారా వచ్చిన పాపులారిటీ అంతా కాదు. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కానీ వీన్నర్ గా మాత్రం కాలేకపోయారు. గడిచిన కొద్ది రోజుల నుంచి బుల్లితెరపై కూడా పెద్దగా కనిపించలేదు చలాకి చంటి దీంతో తమ అభిమానులు చలాకి చంతికి ఏమైందా అంటూ చాలా ఆందోళన చెందుతున్నారు.

Bigg Boss Telugu 6 Fame, Comedian Chalaki Chanti Hospitalized! Check Out  Full Details HERE - Filmibeat
అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం చలాకి చంటి గుండెపోటుతో తీవ్ర అస్వస్థకు గురైనట్లుగా తెలుస్తోంది.దీంతో వెంటనే తన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోకి చేర్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డాక్టర్లు చంటి కి అత్యవసర చికిత్స చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చలాకి చంటి జబర్దస్త్ కంటే ముందుగా పలు చిత్రాలలో నటించి బాగానే పేరు సంపాదించారు ముఖ్యంగా నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో కూడా నటించారు.

ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో కామెడీయన్ గా నటించి అదరగొట్టేశారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి కొన్ని షోలలో నటిస్తూ ఉండేవారు.. ఇక కొన్ని షోలకు పోస్టుగా కూడా వ్యవహరించారు. అయితే ఎంతో యాక్టివ్ గా ఉండే చలాకి చంటి కి ఇలా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన స్నేహితులు అభిమానులు సైతం చాలా ఆందోళన చెందుతున్నారు. అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం చలాకి చంటి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.