రాజ్ తరుణ్ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం అదేనా..?

ఉయ్యాల జంపాల సినిమాతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నటుడు రాజ్ తరుణ్.. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదుగుతారని అందరూ భావించే లోగ దాదాపుగా 13 పైగా సినిమాలలో నటించిన రాజ్ తరుణ్ అంతటి స్థాయిలో విజయాలను మాత్రం అందుకోలేకపోయారు. కొన్ని చిత్రాలు పరవాలేదు అనిపించుకున్న ఆ సినిమాలు ఏవి రాజ్ తరుణ్ కెరీర్ కు ప్లస్ కాలేకపోయాయి.

Raj Tarun dating an actress?
అయితే రాజ్ తరుణ్ కెరియర్లో రెమ్యూనరేషన్ కి ఆశపడి కథలతో సంబంధం లేకుండా ఒకే బ్యానర్లో ఎక్కువ సినిమాలలో నటించడం వల్ల ప్లాపులు చుట్టు ముట్టాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా రిలీజ్ డేట్ల విషయంలో ప్లానింగ్ లేకుండా సినిమాలను విడుదల చేస్తూ ప్రమోషన్స్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల రాజ్ తరుణ్ కెరియర్ నాశనం అవ్వడానికి కారణమని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఈయనకు ఆఫర్లు చాలా తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది. కేవలం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో మాత్రమే ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.

ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నుంచే మొదలు కాబోతోందని సమాచారం. వరుస సినిమాలు ఫ్లాప్ అవడంతో రాజ్ తరుణ్ కూడా రెమ్యూనరేషన్ విషయంలో కాస్త వెనకడుగు వేశారని తెలుస్తోంది. మరి ఈసారైనా రాజ్ తరుణ్ సరైన విజయాలను అందుకోవాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. మరి ఏడాదైనా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు విడుదల చేసి విజయాన్ని అందుకుంటారేమో చూడాలి మరి.