ర‌ష్మిక బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. ఆమె గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

ర‌ష్మిక మంద‌న్నా అంటే తెలియ‌ని వారు. అన‌తి కాలంలోనే పాన్ ఇండియా స్థాయిలో పాపుల‌ర్ అయిన ఈ ముద్దుగుమ్మ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ర‌ష్మిక గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 1996 ఏప్రిల్ 6న కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్‌‌లో సుమన్-మదన్ మందన్నా దంప‌తుల‌కు ర‌ష్మిక జ‌న్మించింది. వీళ్లది కొడవ స్వీకింగ్ ఫ్యామిలీ.

 

రష్మిక జర్నలిజం, సైకాలజీలో డిగ్రీ చేసింది. 2014లో ఆ బ్యూటీ మోడలింగ్ ప్రారంభించింది. ఆమె అదే సంవత్సరం క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది, క్లీన్ అండ్‌ క్లియర్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. ప‌లు యాడ్స్ లోనూ న‌టించి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో దర్శకుడు రిషబ్ శెట్టి `కిరిక్ పార్టి`లో అవ‌కాశం ఇచ్చారు. తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకుంది ర‌ష్మిక‌.

అంతేకాదు, త‌న తొలి సినిమా హీరో అయిన రక్షిత్ శెట్టితో ప్రేమ‌లో ప‌డి.. అత‌డితో ఏడడుగులు వేయాల‌ని అనుకుంది. వీరి నిశ్చితార్థం కూడా జ‌రిగింది. అయితే పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే విడిపోయారు. ఆ త‌ర్వాత ర‌ష్మిక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌డం వ‌రుస హిట్స్ తో స్టార్ హోదాను అందుకోవ‌డం, పుష్ప‌తో పాన్ ఇండియా ఇమేజ్ ద‌క్క‌డం చ‌కచ‌కా జ‌రిగాయి. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.