చిరంజీవి ఇంట్లో బాలయ్య సినిమా షూటింగ్ జరిగిన సినిమా ఏంటో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా పేరుపొందిన వారిలో చిరంజీవి, బాలకృష్ణ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరి హీరోల సినిమాలు నువ్వా నేనా అనే అంతలా పోటీపడుతూ పెద్ద ఎత్తున విడుదల చేస్తూ ఉంటారు. అయితే ఈ పోటీ కేవలం సినిమాల వరకు మాత్రమేనని వ్యక్తిగత జీవితంలో చాలా మంచి స్నేహితులని ఎన్నో సందర్భాలలో తెలియజేయడం జరిగింది. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు అయినప్పటికీ వ్యక్తిగతంగా చాలా స్నేహభావంతో మెలుగుతూ ఉన్నారు.

It's time to change, Chiru and Balayya!
ఇద్దరు కూడా ఎదుర్పడినప్పుడు ఒకరినొకరు ఎంతో మర్యాదపూర్వకంగా గౌరవించుకుంటూ ఉంటారు. బాలయ్య నటించిన ఒక సినిమా కోసం చిరంజీవి తన ఇంటిని షూటింగ్ కి ఇచ్చారనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. తాజాగా ఈ విషయం వైరల్ గా మారుతోంది. బాలయ్య సినీ కెరియర్లో 50వ చిత్రం గా తెరకెక్కించిన నారీ నారీ నడుమ మురారి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఏప్రిల్ 25 1990లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పేరు సంచలనాన్ని సృష్టించింది. ఈ చిత్రం బాలయ్యకు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు.

Nari Nari Naduma Murari | Watch Full HD Telugu Movie Nari Nari Naduma Murari  1990 Online
ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం కావడంతో ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 90 శాతం చిరంజీవి గెస్ట్ హౌస్ లోనే పూర్తి చేశారు. చెన్నైలో చిరంజీవికి ఎంతో ఇష్టమైనటువంటి హనీ హౌస్ అనే గెస్ట్ హౌస్ ఉన్నదట ఈ గెస్ట్ హౌస్ చెన్నైలోని వెళ్లి చెర్రీ ప్రాంతంలో ఉన్నది. ఈ గెస్ట్ హౌస్ అంటే చిరంజీవికి చాలా ఇష్టమట. ఈ హౌస్ పక్కనే రెండు ఎకరాల స్థలం కూడా ఉన్నది. అది కూడా చిరంజీవి దేనట. అలా బాలయ్య సినిమా షూటింగ్ కోసం తన గెస్ట్ హౌస్ అని అడగగా చిరంజీవి వెంటనే షూటింగ్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు హీరోలు తమ సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.