ఆ తప్పే సిల్క్ స్మిత అప్పుల పాలయ్యేలా చేసిందా..?

తెలుగు ప్రేక్షకులకు నటి సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె చనిపోయి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ ఈమె పాటలు ఈమె అందం మత్తెక్కించే కళ్ళు అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా అప్పట్లో గ్లామర్ విషయంలో ప్రేక్షకులను తన వైపు తిప్పుకొని ఎలా చేసింది సిల్క్ స్మిత. అలాంటి సిల్క్ స్మిత జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల గురించి కాకినాడ శ్యామల తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

Silk Smitha:ससुराल से भागकर फिल्मों में एडल्ट स्टार बनी थीं सिल्क स्मिता,  रजनीकांत से जुड़ा था नाम - South Actress Silk Smitha Birthday Know About  Actress Career And Love Life With ...

కాకినాడ శ్యామల మాట్లాడుతూ.. నేను సిల్క్ స్మిత సొంత సినిమాలకు డబ్బులు ఇచ్చాను అయితే ఆ సినిమాలు సరిగ్గా ఆడక పోవడంతో సిల్క్ స్మిత అప్పుల పాలయ్యింది. మొత్తం తన సంపాదించుకున్న ఆస్తిని పోగొట్టుకుంది. వాస్తవానికి సిల్క్ స్మిత వెండితెర పైన వేసే పాత్రలు వేరు రియల్ లైఫ్ లో ఆమె వ్యక్తిత్వం వేరు ఆమె చాలా నిజాయితీగల మనిషి అంటూ తెలియజేసింది. అందుచేతనే అందరికీ అప్పులు తీర్చేసింది అంటూ తెలిపింది శ్యామల. కానీ ఆమె కెరియర్ బాగా సాగుతున్న సమయంలో ఆమె మరణించిందని వార్త విన్నాను ఈ విషయం విని చాలా బాధపడ్డారని తెలిపింది శ్యామల..

కానీ కొంతమంది ఆమెను హత్య చేశారు అంటే మరి కొంతమంది ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు అసలు ఏం జరిగింది ఆ పైవాడికే తెలియాలి కానీ ఆమె చనిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియవు అంటూ తెలియజేస్తోంది కాకినాడ శ్యామల. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా సిల్క్ స్మిత అంతటి గ్లామర్ నటి మళ్ళీ రాదని చెప్పవచ్చు.