బజ్: పుష్ప కూడా ఆస్కార్ కి వెళ్లబోతోందా..?

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప గాడి రూల్స్ అడ్డు పుష్ప-2 చిత్రానికి సంబంధించి ఒక వీడియోని విడుదల చేయడంతో ఆ వీడియో సెన్సేషనల్ గా మారిపోయింది. పుష్ప రాజ్ యాటిట్యూడ్ కి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా పుష్ప మొదటి భాగాన్ని గత ఏడాది డిసెంబర్ లో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ ఈ చిత్రం నార్త్ సైడ్ నుంచి భారీ క్రేజ్ తెచ్చుకోవడంతో బీభత్సమైన కలెక్షన్లను కూడా రాబట్టింది.

Allu Arjun's Pushpa crosses Rs 100 crores worldwide | Filmfare.com
డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమా రెండవ భాగాన్ని భారీ అంచనాలతో తెరకెక్కిస్తూ ఉన్నారు.. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా సుకుమార్ చాలా కేర్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా RRR సినిమాకి ఆస్కార్ ప్రమోట్ చేసినట్టుగా పుష్ప-2 నీ కూడా ప్రపంచవ్యాప్తంగా భారీగా ప్రమోట్ చేయాలని చూస్తున్నారట చిత్రబృందం. RRR చిత్రం కథ వేరు పుష్ప సినిమా కథ వేరు అయినప్పటికీ రాజమౌళి తర్వాత అంతటి స్టాండ్ ఉన్న డైరెక్టర్లలో సుకుమార్ ఒకరని చెప్పవచ్చు.

అందుచేతనే పుష్ప-2 చిత్రాన్ని ఇంటర్నేషనల్ లెవల్ లో ప్రమోట్ చేయాలని చూస్తున్నారు సుకుమార్ ఇలా చేస్తే ఆస్కార్ పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్న గ్యారెంటీ అయితే చెప్పలేము..కానీ..RRR సినిమా తర్వాత అంతలా పాపులారిటీ సంపాదించిన సినిమా పుష్ప-2 అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆస్కారికి అఫీషియల్ నామినేషన్ గా కూడా పుష్ప-2 నీ పంపించేలా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం మరి ఈ సినిమా అవుట్ పుట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆస్కార్ ఎంట్రీ సాధ్యమవుతుందో లేదో చూడాలి మరి.