Dasara: దసరా సినిమా నుంచి డిలీట్ అయిన వీడియో వైరల్..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో కూడా సరికొత్త డైరెక్టర్లు పుట్టుకొస్తూ మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నారు. నూతన దర్శకుడుగా తెలుగు తెరకు పరిచయమైన శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే కలెక్షన్ల పరంగా బాగా ఆకట్టుకుంది. ఇందులో హీరో నాని కీర్తి సురేష్ జంటగా నటించారు. ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. పూర్తిగా తెలంగాణ యాసలు వచ్చిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ లభించింది.

Dasara Movie: The pain of the moon that the audience does not see.. Have  you seen the deleted scene of 'Dasara' movie?.. | Dasara Movie Deleted Scene  Released Starrer Nani and Keerthy

సింగరేణి బొగ్గు గనులు నేపథ్యంలో వచ్చిన దసరా సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలకమైన పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్నాయి. ఇటీవలే విడుదలైన వెన్నెల మాస్ డాన్స్ కూడా అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి డిలీట్ అయిన ఒక సన్నివేశాన్ని చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది.

అందులో ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని వెన్నెల పాత్రలోని ఆవేదనను చూపించారు.. ముఖ్యంగా తన తల్లితో వాగ్దానానికి దిగుతున్నట్టుగా ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఇక కీర్తి సురేష్ చెప్పే డైలాగు ఈ వీడియోలో హైలెట్గా నిలుస్తోంది. అందరూ కూడా తన బతుకులు ఎట్లా చేసిండ్రు చూసినావా అత్త అని ఆవేదన వ్యక్తం చేస్తోంది వెన్నెల.. హాట్ టచింగ్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.. ఈ వీడియో చూసిన అభిమానులు సైతం ఇంత మంచి సన్నివేశాన్ని ఎందుకు డిలీట్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.