చీరకట్టులో మెరిసిన యాంకర్ విష్ణుప్రియ.. అమ్మడి అందాలకు ఫ్యాన్స్ ఫిదా!

ఈటీవీ ప్రోగ్రామ్స్ ద్వారా అందరికీ సుపరిచితురాలయింది యాంకర్ విష్ణు ప్రియ. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ రెండు ముక్కల గుడ్డలు ధరించి స్కిన్ షో చేస్తూ పిచ్చెక్కించేది. కాగా ఇప్పుడు చీర కట్టుకుని విలేజ్ గర్ల్ లాగా దర్శనమిచ్చింది.

పల్లెటూరి పిల్లలాగా విష్ణుప్రియ అద్భుతంగా కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆకుపచ్చ చీరలో విష్ణుప్రియ దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తున్నాయి.

ఈ ఫొటోలలో విష్ణుప్రియ నగలు ధరించి చాలా అందంగా కనిపించింది. నవ్వే ఆభరణంగా ఈ అందాల యాంకర్ ధరించి వావ్ అనిపించింది. ఇకపోతే విష్ణుప్రియ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ చేసి గుర్తుతెలియని కొందరు వ్యక్తులు అశ్లీల ఫొటోలు పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ షాక్ అయింది ఆ తర్వాత తన అకౌంట్ బ్లాక్ చేయాలనుకున్నది కుదరలేదు. దీని పట్ల విచారం వ్యక్తం చేసిన ఆమె తన అభిమానులకు క్షమాపణలు తెలిపింది.

ఇక విష్ణుప్రియ తల్లి ఇటీవల తుది శ్వాస విడిచారు. ఎంతో ప్రేమగా పెంచిన తన తల్లి చనిపోయిందనే విషయాన్ని చెప్పి విష్ణుప్రియ చాలా ఎమోషనల్ అయింది. ఆమెతో తనకున్న జ్ఞాపకాలను కూడా అభిమానులతో పంచుకుంది. బుల్లితెరలో కొంతకాలం పాటు రాణించిన ఈ యాంకర్ ఇప్పుడు సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకునేందుకు తనవంతు కృషి చేస్తుంది.

గత ఏడాది వాంటెడ్ పండుగాడ్ మూవీలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ పట్టేసింది. ఒక చిన్న యూట్యూబర్ నుంచి కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ ఒక హీరోయిన్ స్థాయికి ఎదగడం అప్‌కమింగ్ యాక్ట్రెస్‌లకు స్పూర్తి దాయకమని చెప్పవచ్చు.