ఎన్టీఆర్ 30 నుంచి అదిరిపోయే న్యూస్..కొరటాల ప్లాన్ మామూలుగా లేదుగా..!

గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వ‌స్తున్న‌ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇది వరకే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ 30 షూటింగ్ లో జాయిన్ అయినట్లు అధికార అనౌన్సమెంట్ కూడా వచ్చేసింది.

గతంలో మేము చెప్పిన విధంగానే సైఫ్ అలీఖాన్ ఈ సినిమా చేస్తున్నాడు. కొరటాలకి మంచి దర్శకుడిగా గొప్ప పేరు ఉంది. అయితే, అంతకు మించి మంచి కథా రచయితగా కొరటాల శివకి లాంగ్ జర్నీ ఉంది. ముఖ్యంగా ఆయన రాసే బలమైన పాత్రలకు, భావోద్వేగ సన్నివేశాలకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ను కూడా కొరటాల అద్భుతంగా డిజైన్ చేశాడట. అందుకే సైఫ్ ఒప్పుకున్నాడు. విల‌న్‌ పాత్ర సైఫ్ అలీ ఖాన్ కి చాలా బాగా నచ్చిందట.

तो क्या Jr. NTR की फिल्म NTR 30 में Saif Ali Khan बनेंगे विलयन, सामने आई फिल्म से जुडी बड़ी जानकरी

నేడు సైఫ్ అలీఖాన్ షూట్ లో కూడా జాయిన్ అయ్యారు. సెట్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివతో సైఫ్ అలీఖాన్ ఉన్న ఫోటోలను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ పోర్టు సెట్‌ను కూడా సిద్ధం చేశారు. కొరటాల శివ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కథతో ఎన్టీఆర్ తో ఈ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 5, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.