ఎపిక్ డిజాస్టర్ గా `శాకుంత‌లం`.. ఎన్ని కోట్ల న‌ష్టాలో తెలిస్తే మైండ్ బ్లాకే!

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ జంట‌గా న‌టించిన‌ `శాకుంత‌లం` ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖర్ తెర‌కెక్కించిన ఈ మూవీని దిల్ రాజు, నీల‌మ గుణ నిర్మించారు.

ఎపిక్ ల‌వ్ స్టోరీగా ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద ఎపిక్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. యావ‌రేజ్ టాక్ తో శాకుంత‌లం బాక్సాపీస్ వ‌ద్ద ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోతోంది. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లో క‌నీసం నాలుగు కోట్ల రేంజ్ లో కూడా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం నాలుగో రోజు రూ. 20 లక్షలు షేర్ ని మాత్ర‌మే అందుకోగా.. వరల్డ్ వైడ్ గా రూ. 28 లక్షలతో స‌రిపెట్టుకుంది. ఇక ఏరియాల వారీగా శాకుంత‌లం 4 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 97 లక్ష‌లు
సీడెడ్: 23 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 34 ల‌క్ష‌లు
తూర్పు: 18 ల‌క్ష‌లు
పశ్చిమ: 11 ల‌క్ష‌లు
గుంటూరు: 16 ల‌క్ష‌లు
కృష్ణ: 18 ల‌క్ష‌లు
నెల్లూరు: 8 ల‌క్ష‌లు
————————————
ఏపీ+తెలంగాణ‌= 2.25 కోట్లు(4.45 కోట్లు~ గ్రాస్‌)
————————————

తమిళం – 32 ల‌క్ష‌లు
రెస్టాఫ్ ఇండియా – 35 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్‌- 96 ల‌క్ష‌లు
———————————————
టోటల్ వరల్డ్ వైడ్ = 3.88 కోట్లు(8.05 కోట్లు~ గ్రాస్)
———————————————

కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 15.12 కోట్లు రాబ‌డితే బాక్సాఫీస్ వ‌ద్ద శాకుంత‌లం క్లీన్ హిట్ గా నిలుస్తుంది. కానీ, ఈ రేంజ్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డం క‌ష్టమే. లాంగ్ ర‌న్ లో ఈ సినిమాకు రూ. 12 నుంచి 13 కోట్ల రేంజ్ లో న‌ష్ట‌లు ఖాయ‌మ‌ని సినీ పండితులు చెబుతున్నారు.