యాంకర్‌ సుమ అరెస్ట్.. పాపం అల్ల‌రోడి ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది!

బుల్లితెర స్టార్ యాంక‌ర్ సుమ అరెస్ట్ అంటూ నిన్న వార్త‌లు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆమె చేతికి బేడీలు వేసి కారులో తీసుకెళ్తున్న ఫోటో ఒకటి నెట్టింట తెగ వైర‌ల్ అయింది. అయితే ఆమె నిజంగా ఏ నేర‌మో చేసి అరెస్ట్ అవ్వ‌లేదు. ఇదంతా అల్ల‌రి న‌రేష్ న‌టించిన `ఉగ్రం` సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగింది.

ఈ సినిమా త్వరలోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే చిత్ర ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగానే తాజాగా సుమని అరెస్ట్ చేసి ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేశారు. కానీ, పాపం అల్ల‌రోడి ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. సుమ అరెస్ట్ అయిన ఫోటో బ‌య‌ట‌కు రాగానే ఇదంతా నాగ‌చైత‌న్య `కస్టడీ` సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జ‌రిగింద‌ని అంద‌రూ అనుకున్నారు.

సోష‌ల్ మీడియాలోనూ ఇదే ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే `క‌స్ట‌డీ`పై మంచి బ‌జ్ క్రియేట్ చేసింది. అస‌లు `ఉగ్రం` సినిమా ఎవ‌రి మైండ్ కు త‌ట్ట‌లేదు. దీంతో ఉగ్రం టీమ్ అల్లరి నరేష్‌తో సుమ ఉన్న ఫోటోని విడుదల చేశాడు. ఇక అప్పుడు అస‌లు మ్యాట‌ర్ తెలిసి అంద‌రూ అవాక్కవుతున్నారు. మొత్తానికి అల్లరి నరేష్‌ టీమ్‌ పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. సుమని అరెస్ట్ చేసి ప్రమోషన్స్ పరంగా `ఉగ్రం`పై హైప్‌ క్రియేట్‌ చేయాలని భావిస్తే.. చివ‌ర‌కు అది నాగ‌చైత‌న్య `క‌స్ట‌డీ` మూవీకి క‌లిసొచ్చింది.