సమంతకు అదిరిపోయే రిప్లై ఇచ్చిన అఖిల్..!!

అక్కినేని కుటుంబంతో సమంత ఇప్పటికీ సన్నిహితంగా ఉందనే వార్తలు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి.. అంతేకాకుండా పలు సందర్భాలలో నాగచైతన్య నుంచి విడిపోయిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ తనలో తాను కుమిలిపోతూ కనిపిస్తూ ఉంటుంది సమంత. రానా, మీహిక, అఖిల్ తో సహా పలువురు అక్కినేని కుటుంబంలోని వారితో ఇప్పటికీ సమంత టచ్ లోనే ఉంటోంది.. నిన్నటి రోజున అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె బర్తడే విషెస్ ను కూడా తెలియజేసింది.

Samantha Sends Hug To Ex-Husband Naga Chaitanya's Brother Akhil As She  Wishes Him On His B'day
ఇక గత ఏడాది కూడా అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సమంత ఒక స్పెషల్ పోస్ట్ చేస్తూ విషెస్ చెప్పిన.. ఎందుకో అఖిల్ మాత్రం స్పందించలేదు..దీంతో ఈసారైనా అఖిల్ సమంతకు రిప్లై ఇస్తాడా అని చాలామంది నేటిజన్లు ఎంత ఆత్రుతగా ఎదురు చూశారు. గత ఏడాది లాగే ఇప్పుడు కూడా సమంత పోస్టును పట్టించుకోడు అంటూ కొంతమంది కామెంట్లు చేశారు.. కానీ వాళ్ళందరికీ దిమ్మతిరిగే షాక్ ఇస్తూ అఖిల్ సమంతకు థాంక్స్ చెబుతూ ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది.

థాంక్యూ సో మచ్ సామ్ నీ అంచనాలను అందుకుంటాను అనుకుంటున్నాను.. అంటూ హాట్ ఎమోజిని జత చేసి షేర్ చేశారు. దీంతో అఖిల్ షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్ వైరల్ గా మారుతోంది.. దీంతో రాబోయే రోజుల్లో సమంత నాగచైతన్య కలవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో పాన్ ఇండియా లేవలో పేరు పొందాలని ప్రయత్నిస్తున్నారు ఇక సమంత కూడా శాకుంతలం సినిమా ఈ నెలలోనే విడుదల కాబోతోంది. నాగచైతన్య కస్టడీ అనే సినిమాలో నటిస్తున్నారు.