అరుంధ‌తిలో `జేజ‌మ్మ‌` పాత్ర‌ను రిజెక్ట్ చేసిన ప్రేమ‌.. ఎందుకో తెలిస్తే షాకే!

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించిన `అరుంధ‌తి` చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ రోల్స్ కే ప‌రిమితం అయిన‌ అనుష్క‌.. ఈ చిత్రంలో అరుంధతి మ‌రియు జేజ‌మ్మగా ద్విపాత్రాభిన‌యం చేసి త‌న న‌ట‌నా విశ్వ‌రూపాన్నిచూపించింది.

లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కేరాఫ్ గా నిలిచింది. అయితే నిజానికి ఈ సినిమాలో జేజ‌మ్మ పాత్ర‌కు మొద‌ట అనుష్క‌ను అనుకోలేద‌ట‌. కోడి రామ‌కృష్ణ ఆ పాత్ర కోసం న‌టి ప్రేమ‌ను సంప్ర‌దించార‌ట‌. అప్ప‌టికే వీరి కాంబినేష‌న్ లో వ‌చ్చిన `దేవి` సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఆ స‌న్నిహిత్యంతోనే జేజ‌మ్మ రోల్ కోసం ప్రేమ‌ను సంప్ర‌దించ‌గా.. ఆమె రిజెక్ట్ చేసింద‌ట‌.

జేజ‌మ్మ పాత్ర ప్రేమ‌కు బాగా న‌చ్చింద‌ట‌. అయిన‌సారే ఆమె నో చెప్పింద‌ట‌. ఎందుకో తెలిస్తే షాకైపోతారు. డేట్స్ ఖాళీగా లేవు అన్న చిన్న కార‌ణంతో జేజ‌మ్మ వంటి పాత్ర‌ను ప్రేమ‌ రిజెక్ట్ చేసింద‌ట‌. తాజాగా ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో ప్రేమ చెప్పుకొచ్చింది. అయితే ఆ రోల్ చేయ‌నంద‌కు త‌న‌కు బాధ‌గా ఏమీ లేద‌ని.. ఆ పాత్ర త‌న‌కు రాసిపెట్టి లేద‌ని ప్రేమ చెప్పుకొచ్చింది.