నందమూరి ఫ్యామిలీలో ఎన్నో చీకటి కోణాలు.. తెలిస్తే అసహ్యించుకుంటారు!!

నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలలో ఎంతో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఆయన్ని రోడ్డుకిడ్చింది మాత్రం ఆయన కుటుంబమే. కుటుంబ సభ్యులందరూ ఎన్టీఆర్ ని ఒంటరిని చేసి ఆయన పదవి, సంపద లాక్కుని మానసిక క్షోభకు గురి చేశారు. ఎన్టీఆర్ కి 14 మంది సంతానం ఉన్నప్పటికీ చివరి రోజుల్లో మాత్రం ఆయన లక్ష్మి పార్వతి వద్ద దుర్భర పరిస్థితుల మధ్య కన్నుమూశారు. ఇక ఆయన మరణించిన తరువాత కొంతమంది కుటుంబ సభ్యులు పదవుల కోసం, పార్టీ కోసం ఎన్టీఆర్ పేరు చెప్పుకుని పబ్బం గడుపుతున్నారు.

ఇక ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా నందమూరి ఫ్యామిలీ అదే చేసింది. స్టూడెంట్ నం.1, ఆది, సింహాద్రి విజయాలతో ఎన్టీఆర్ టాప్ స్టార్ అయ్యారు. అయితే ఎన్టీఆర్ విజయం బాలకృష్ణ వర్గానికి నచ్చలేదు. దాంతో ఎన్టీఆర్‌ని తొక్కేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఎన్టీఆర్‌ని ఎదగకుండా చేసేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఎన్టీఆర్ తల్లి మన కమ్యూనిటీ కాదనే కారణం చెప్పి అతని నందమూరి అభిమాన వర్గాన్నికి దూరం చేయాలని చూశారు. ఇక ఎన్టీఆర్ సినిమాకు థియేటర్స్ ఇవ్వొద్దని బాలయ్య బెదిరించినట్లు ఓ వ్యక్తి డైరెక్ట్‌గా చెప్పాడు. ఇప్పుడు కూడా టీడీపీలోకి ఎన్టీఆర్ ని రాకుండా చేస్తున్నారు.

సీనియర్ ఎన్టీఆర్ కి ఆయన తమ్ముడు త్రివిక్రమరావు అంటే ప్రాణం. ఎన్టీఆర్ హీరోగా ఎదిగాక త్రివిక్రమరావును ఇండస్ట్రీకి తీసుకొచ్చి నిర్మాతను చేశాడు. త్రివిక్రమరావు నిర్మాణంలో ఎన్టీఆర్ కొన్ని సినిమాలు చేశాడు. తనకంటే చిన్నవాడైన కూడా ఎన్టీఆర్,త్రివిక్రమరావు మాటను గౌరవించేవాడట. అలాంటి త్రివిక్రమరావును కూడా ఎన్టీఆర్‌కి దూరం చెయ్యడానికి ఎన్నో మనస్పర్థలు సృష్టించారు. దాంతో త్రివిక్రమరావు కొడుకు కళ్యాణ్ చక్రవర్తి హీరో కావాలనుకున్నా కూడా ఎన్టీఆర్ ఎలాంటి సపోర్ట్ చెయ్యలేదు. ఇక తారకరత్న మరణంతో కూడా కొన్ని లొసుగులు బయటకు వచ్చాయి.

తారకరత్న తండ్రి కర్కశంగా వ్యవహరించారు. తారకరత్న మరణంతో కన్నీరు మున్నీరవుతున్న అలేఖ్య రెడ్డి, ఆమె పిల్లలను ఆయన అక్కున చేర్చుకోలేదు. ఓదార్చే ప్రయత్నం చేయలేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కారణంగా తారకరత్నను కూడా నందమూరి కుటుంబం ఎన్నో ఇబ్బంధులు పెట్టారు. ఒక దశలో తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నానని, జూనియర్ ఎన్టీఆర్ కొంత డబ్బులు ఇచ్చి ఆదుకున్నాడని తారకరత్న స్వయంగా చెప్పారు. ప్రేమ వ్యవహారంలో హీరో వడ్డే నవీన్ ని కూడా తొక్కేశారనే వాదన ఉంది. ఇలా నందమూరి కుటుంబంలో చెప్పుకుంటూ పోతే చీకటి కోణాల చాలానే ఉన్నాయి.