తాప్సి-కంగనా రనౌత్ మధ్య వివాదం ముగిసినట్టేనా..!!

హీరోయిన్ తాప్సి- కంగనా బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందారు. వీరిద్దరి మధ్య ఎప్పుడూ కూడా ఏదో వివాదం జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఈ వివాదం మీద ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది తాప్సి.. కంగనా గ్రేట్ యాక్టర్ అని.. సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది గ్లామర్ హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పైన ఎంట్రీ ఇచ్చిన కంగనా.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలలో నటించి అవార్డు విన్నింగ్ స్టార్ గా కూడా మారింది. ఆ సమయంలోనే ఇండస్ట్రీ సమస్యలతో పాటు పొలిటికల్ ఇష్యుల మీద కూడా రియాక్ట్ అవుతూ ఫైర్ బ్రాండ్ అన్న పేరు కూడా సంపాదించింది.

తాప్సి కూడా గ్లామర్ గర్ల్ గానే తన కెరీర్ ను మొదలుపెట్టి సౌత్లో సక్సెస్ దక్కక పోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. అక్కడ లేడి ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది తాప్సి. హీరోయిన్గా ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో పలు రకాలుగా పలు విషయాల పైన పోస్ట్ చేస్తూనే ఉంటుంది. సినిమా కోసం ఎంత రిస్క్ చేయడానికి అయినా సరే వెనుకాడరు తాప్సి -కంగనా ఈమధ్య తలైవి సినిమా కోసం కాస్త బరువు పెరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ధకాడ్ సినిమా కోసం యాక్షన్ స్టంట్ లు కూడా నేర్చుకుంది.

ఇప్పుడు ఎమర్జెన్సీ సినిమా కోసం గంటల తరబడి ప్రొటెస్టింగ్ మేకప్ తో వర్క్ చేస్తున్నది.. తాప్సి కూడా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉంది. రష్మీ రాకెట్ కోసం అథ్లెటిక్ ఫిజిక్ అచీవ్ చేయడం శభాష్ మిధున్ కోసం ప్రొఫెషనల్ రేంజ్ లో క్రికెట్ నేర్చుకోవడం వంటివి తాప్సి కి మాత్రమే సాధ్యమైంది. ఇద్దరు ఒకే స్టైల్ లో కెరియర్ను కంటిన్యూ చేస్తూ ఉండగా మరి వీరిద్దరూ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కడ కనపడిన నవ్వుతూ పలకరించుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు సర్దుమునిగాయనే వార్తలు వినిపిస్తున్నాయి.