వెంకటేష్ భార్య ఎవరు ? ఆమె తన భర్త కోసం ఎలాంటి త్యాగం చేసిందో తెలుసా..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. భారీ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా తనదైన నటనతో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో స‌క్సెస్ ఫుల్‌గా తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు. అయితే వెంకటేష్ వృత్తిపరమైన విషయాలు తప్పితే.. ఆయన కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలు పెద్దగా ఎవరికీ తెలియవు.

విక్టరీ వెంకటేష్ కు రామానాయుడు పెట్టిన పేరేంటో తెలుసా | Venkatesh Original  Name Kept By Ramanaidu, Ramanaidu , Venkatesh , Tollywood , Suresh Babu ,  Venkateswarlu , Tirupathi, Allu Arjun - Telugu Allu ...

ఆయన భార్య, పిల్లల గురించి కూడా ఎక్కడా ప్రస్తావించరు. వెంకటేష్ సినిమాల ఈవెంట్స్‌కు కూడా తన కుటుంబ సభ్యులు దూరంగా ఉంటారు. ఇక వెంకటేష్ భార్య పేరు నీరజారెడ్డి. వెంకటేష్ వివాహం కోసం తండ్రి రామానాయుడు సంబంధాలు చూసేటప్పుడు డబ్బు, కులం వంటివి పట్టించుకోకుండా అమ్మాయి గుణగణాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వెంకటేష్‌కు నీరజారెడ్డి తో వివాహం జరిపించారు. ఇక ఈమెది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లి. ఆమె తల్లిదండ్రులు గంగవరపు వెంకట సుబ్బారెడ్డి, ఉషారాణి.

ఏ హీరో చేయని పని పాతికేళ్ల క్రితమే వెంకటేష్ చేసి చూపించాడు. నిజంగా గ్రేట్ |  Facts behind Venkatesh marriage with Neeraja Reddy, Victory Venkatesh,  Venkatesh Wife Neeraja Reddy, Venkatesh ...

నీరజా రెడ్డి కుటుంబానికి వందలాది ఎకరాల భూమితో పాటు ప‌లు వ్యాపారాలు కూడా ఉన్నాయి. అలాగే ఈమె విదేశాలలో ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. చదువు పూర్తయిన అతికొద్ది రోజులకే నీరజా రెడ్డిని.. వెంకటేష్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. డిసెంబర్ 13,1987లో వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు. అయితే వెంకటేష్ భార్య నీరజారెడ్డి చదువుకునే రోజుల్లోనే వ్యాపార రంగంలోకి వెళ్లాలని కలలు కనే వారట. కానీ ఆ కోరిక నెరవేరకుండానే ఆమె పెళ్లి జరిగిపోయింది.

Venkatesh and Neeraja

ఆ వెనువెంటనే నలుగురు పిల్లలు కూడా జన్మించారు. ఇక దాంతో నీరజా తన కలలను తన కుటుంబం కోసం త్యాగం చేశారట. ఇక నీరజ ప్రతి విషయంలోనూ తన భర్త వెంకటేష్‌కు చేదోడు వాదోడుగా నిలిచేవారట. వెంకటేష్ సైతం తన భార్యకు ఎంతో గౌరవం ఇస్తారట మరిఎంతో ప్రేమ కూడా చూపిస్తారట. ఇక తన భర్త ఓ పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా నీరజా ఎంతో సింపుల్‌గా తన ఫ్యామిలీ లైఫ్‌ను కొనసాగిస్తున్నారట.