జిమ్‌లో శ్రీదేవి కూతురు కసరత్తులు.. అమ్మడి అందాలు చూస్తే..

ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బాలీవుడ్ భామకి అక్కడ రాని క్రేజీ ఆఫర్స్‌ మన టాలీవుడ్‌లో వచ్చింది. కేవలం శ్రీదేవి మీద అభిమానంతో జాన్వీ కపూర్‌కి ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు కొరటాల శివ. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కలిసి నటించారు. ఇక ఇన్నేళ్ల తరువాత సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వీ కలిసి నటించబోతున్నారు.

నిజానికి శ్రీదేవి సౌత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న తరువాతనే బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చి బాగా సక్సెస్ అయింది. అందుకే జాన్వీ కపూర్‌ని కూడా సౌత్‌కి తీసుకు రావాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ అవేమీ ఫలించలేదు. జాన్వీ కపూర్‌కి అసలు సౌత్‌లో నటించడం ఇష్టం లేదు. అందుకే సౌత్ నుంచి వచ్చిన ఆఫర్స్ ని రిజెక్ట్ చేస్తుందనే ప్రచారం కూడా జరిగింది. మరి వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం ఎవరికీ తెలియదు. అయితే ఇటీవలే మళ్లీ చిత్ర ప్రొమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన జాన్వీని ఎన్టీఆర్ సినిమా గురించి ప్రశ్నించారు కొంతమంది. ఆ ప్రశ్నకు జాన్వీ స్పందిస్తూ ‘ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ వస్తే అసలు వదులుకోను. ఆయన గ్రేట్ యాక్టర్’ అంటూ చెప్పుకొచ్చింది.

 

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

ఇక ఆమె కెరీర్ మొదలై ఐదేళ్ళు అవుతున్నప్పటికీ ఒక్క స్టార్ హీరోతో కూడా నటించలేదు. మొదటి సారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. దాంతో ఈ భామ హాట్ ఫోటో షూట్ ని మొదలు పెట్టింది. ఇంస్టాగ్రామ్ లో జాన్వీ కి 21 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె కెరీర్‌లో ఒక్క బ్లాక్‌బస్టర్ మూవీ లేకపోయినా గ్లామర్‌తో అభిమానులని సంపాదించింది. ఈ అమ్మడు అందాలు చూస్తే ఎలాంటివారికైనా మతిపోవాల్సిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ పర్ఫెక్ట్ ఫిట్ బాడీ సాధించేందుకు చాలా కష్టపడుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ తన జిమ్ వీడియో షేర్ చేసింది. కఠిన కసరత్తులతో చెమటలు పట్టిస్తున్న ఆమెను చూస్తే కుర్రాళ్లకు నిద్ర కూడా పట్టదు.