కనీవినీ ఎరుగని రోల్ చేయనున్న శ్రియా శరణ్.. అమ్మడికి డిమాండ్ ఏమీ తగ్గలేదు!

ప్రముఖ నటి శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. తన నటనతో, గ్లామర్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పాపారావు బియ్యాల దర్శకత్వంలో రూపొందిన ‘మ్యూజిక్ స్కూల్’ లో లీడ్ రోల్‌లో నటించింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, షర్మాన్ జోషి, సుహాసిని ములాయ్, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యపాత్రల్లో నటించారు.

పదకొండు పాటలతో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాని మే 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మ్యూజిక్ స్కూల్ సినిమాని హిందీలో పి.వి.ఆర్‌, తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఆ తరువాత దిల్ రాజు మాట్లాడుతూ ‘ఎడ్యుకేషన్ విషయంలో పిల్లలపై ఎంత ప్రెజర్ పడుతుందనేది తెలియజేసే సినిమానే ‘మ్యూజిక్ స్కూల్‌’ అని చెప్పారు.

‘ప్రస్తుతం ఎక్కడా చూసినా ఇదొక సీరియస్ పాయింట్. అయినప్పటికీ దీనిని మ్యూజికల్ ఫిల్మ్‌గా చేశారు పాపారావు. శ్రియ మెయిన్ లీడ్‌గా, చిన్న పిల్లలతో ఈ సినిమాను చేశారు. అలానే ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం హైలైట్ అవుతుంది’ అని దిల్ రాజు అన్నారు. ఇక ఇలాంటి సినిమాలో శ్రియా నటిస్తుందని ఎవరూ ఊహించలేదు. కొత్త జానర్ లో వస్తున్న ఈ సినిమా  ఈ ముద్దుగుమ్మ అభిమానులను ఎంతగా అలరిస్తుందో చూడాలి మరి.