మరి కొద్ది గంటల్లో దసరా సినిమా రిలీజ్.. నాని కి ఊహించని షాక్.. అభిమానులు ఆందోళన..!?

టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా దసరా . శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . కాగా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై కొందరు కావాలని కుట్ర చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటికే పలు థియేటర్స్ వద్ద నాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ హంగామా మొదలైంది.

పలు థియేటర్స్ వద్ద నాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ భారీ కటౌట్లతో .. పాలాభిషేకాలతో నాని ఫాన్స్ థియేటర్స్ వద్ద రచ్చ రచ్చ చేస్తున్నారు . అయితే నాని సినిమాను ఎలా అయినా సరే ప్లాప్ టాక్ క్రియేట్ చేయడానికి తెరవెనుక ఓ బ్యాచ్ రెడీ అయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పలు థియేటర్స్ వద్ద నాని యాంటి ఫాన్స్ సినిమాపై నెగటివ్ టాక్ ని క్రియేట్ చేసే విధంగా మాట్లాడుతున్నారని.. ఇదేవిధంగా పలు వెబ్సైట్స్ లో కూడా నాని సినిమాకి రేటింగ్ తక్కువ ఇచ్చే విధంగా పక్కాగా స్కెచ్ వేసుకొని ఓ బ్యాచ్ రంగంలోకి దిగింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే అలర్ట్ అయిన ఫ్యాన్స్ నాని సినిమాకు ఎక్కడ డి గ్రేడ్ టాక్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు . ప్రతి థియేటర్స్ వద్ద నాని ఫ్యాన్స్ ముందు జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా ఒరిజినల్ టాక్ ను బయట పెట్టడానికి ట్రై చేస్తున్నారు . ఈ క్రమంలోని సినిమా రిలీజ్ కి మరి కొద్ది గంటల ముందు ఇలా దసరా సినిమాకి సంబంధించిన నెగటివ్ టాక్ ని క్రియేట్ చేసేలా ఓ బ్యాచ్ రంగంలోకి దిగింది అని తెలియడం అభిమానులకు హార్టింగ్ అనిపిస్తుంది. దీనిపైన నాని ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..!!

Share post:

Latest