`మన్మథుడు` బ్యూటీ అన్షు ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

అన్షు.. ఈ అందాల భామ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సొంత ఊరు ఢిల్లీ అయిన‌ప్ప‌టికీ లండ‌న్ లో జ‌న్మించిన ఈ ముద్దుగుమ్మ‌.. అక్కినేని నాగార్జున హీరోగా కె.విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆల్ టైం హిట్ మూవీ `మ‌న్మ‌థుడు`తో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది.

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. త‌న అందం, అమాయకత్వంతో కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపింది. మ‌న్మ‌థుడు అనంత‌రం రాఘవేంద్ర, మిస్సమ్మ త‌దిత‌ర చిత్రాల్లో మెరిసింది.

తొలి సినిమా హిట్ అయినా.. ఆ త‌ర్వాత హీరోయిన్ గా నిల‌దొక్కుకోలేక‌పోయింది. అదే స‌మ‌యంలో సచిన్ సాగర్ అనే వ్యాపార‌వేత్త‌ను పెళ్లి చేసుకుని లండ‌న్ లో సెటిల్ అయింది.

వివాహం త‌ర్వాత న‌ట‌న‌కు పూర్తిగా దూర‌మైన‌ అన్షు ఇద్దరు పిల్లల‌కు జ‌న్మనిచ్చింది. ప్రస్తుతం హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఇక‌పోతే అన్షు ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు.

ఎందుకంటే, ఇర‌వై ఏళ్ల క్రితం మ‌న్మ‌థుడు సినిమాలో ఎంత‌ ఫిట్ ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉంది. ముఖంలో మునుప‌టి కళ లేక‌పోయినా.. మోడ్ర‌న్ దుస్తుల్లో మిస్మ‌రైజ్ చేస్తోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యామిలీ ఫోటోలను, పిల్లలతో దిగిన పిక్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది.

Share post:

Latest