అవకాశాలు రావాలంటే పక్కలో పడుకోవాల్సిందే.. సునీల్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..

నటి ఎస్తేర్ తన కెరీర్ మొదట్లో సినిమాలతో స్పీడ్ పెంచినప్పటికీ తరువాత స్లో అయింది. ఈ మధ్య వెబ్ సీరిస్ ల్లో సైతం నటిస్తోంది ఈ అమ్మడు. 1000 అబద్దాలు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎస్తేర్, సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడుతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడి వైవాహిక జీవితం మాత్రం మధ్యలోనే ఆగిపోయింది ప్రముఖ సింగర్ నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎస్తేర్ వ్యక్తిగత కారణాలవల్ల వివాహం జరిగిన ఏడాదిలోపే వీరిద్దరూ విడాకులు తీసుకొన్నారు.

తాజగా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై ఎస్తేర్ ఇంటరెస్టింగ్ కామెంట్లు చేసింది. ఆడవాళ్లకు ఏ ఇండస్ట్రీలోనైనా ఇబ్బందులు తప్పడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఎస్తేర్. ఈ అమ్మడు ఇక ఎస్తేరు తెలుగులోనే కాదు కన్నడ, మలయాళం, మరాఠీ వంటి పలు భాషల్లో కూడా నటిస్తోంది. “అవకాశాల కోసం చెప్పింది చేసే వాళ్ళు ఉన్నారు.. అలా కాకుండా వద్దు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.. వాళ్ళలో నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను అవకాశాల కోసం మరీ అంత దిగజారలేను.. అందుకే ఒక సినిమా పోయినా పర్వాలేదు అనుకుంటాను” అంటూ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.

ఇండస్ట్రీలో ఎదగాలని, అవకాశాలు రావాలి అనుకుంటే క్యాస్టింగ్ కౌచ్ కు బలి కావాల్సిందే అని కొందరు అంటున్నారు, కానీ నా వరకూ మాత్రం మన హద్దుల్లో మనం ఉంటే మంచిది అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేసింది ఎస్తేర్.