అసిస్టెంట్ తో చెప్పులు విప్పించిన హాట్ హీరోయిన్..!!

సినీ నటీనటులకు ఏదైనా సందర్భానుసారం బయటికి వచ్చారంటే చాలు పలు సందర్భాలలో అభిమానులు ఒక్కసారిగా చుట్టుముడుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా ఏదైనా తప్పు చేసినా కూడా అదే స్థాయిలో ట్రోల్ చేస్తూ ఉంటారు. అందుకే సినీ ప్రముఖులు ఏదైనా ఈవెంట్ కు వెళితే నడక నుంచి మాట తీరు వరకు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏ చిన్న తప్పు చేసినా నేటిజెన్లు సైతం ఆడేసుకుంటూ ఉంటారని చెప్పవచ్చు.

Bhumi Pednekar Removing Her Shoes With Assistant, Netizens Fire - Sakshi

తాజాగా బాలీవుడ్ బ్యూటీ భూమి హెడ్నేకర్ తన అసిస్టెంట్లతో చెప్పులు విప్పించుకొని మరీ వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకి వెళితే భూమి ఫెడ్నేకర్ తాజాగా ఒక ఈవెంట్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ కార్యక్రమం ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలలో పాల్గొనింది. ఆ సమయంలో అతిథులంతా కూడా స్టేజ్ పైకి ఎక్కడం జరిగింది. పక్కనే నిలబడి ఉన్న భూమిని కూడా స్టేజ్ పైకి రావాలని పిలిచినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె చెప్పులు విప్పి అక్కడికి వెళ్లాలనుకుంది. కానీ ఎంత ప్రయత్నించినా తన కాలికి ఉన్న చెప్పులు తీయలేకపోవడంతో ఆ పక్క నుంచి వచ్చిన అసిస్టెంట్ కి సైగా చేయగా.. అతను వచ్చి సహాయం చేశారు. ఆ తర్వాత ఆమె చెప్పులు విడిచి స్టేజ్ పైకి దీపపు కుందపు దగ్గరకు వెళ్ళింది. అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

దీంతో ఆమె స్టేజ్ పైకి వెళ్ళింది. అసిస్టెంట్ తో చెప్పులు తీయించుకోవడాన్ని చూసిన నెటిజన్లు సైతం ఈ ముద్దుగుమ్మని తప్పు పడుతున్నారు. టాయిలెట్, ఏక్ ప్రేమ్ కథ బాల తదితర వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న భూమి ఫెడ్నేకర్ మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో కూడా ఈమె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

Share post:

Latest