అనారోగ్యానికి గురైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..!!

టాలీవుడ్లో ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్గా గుర్తింపు పొందింది పాయల్ రాజ్ పుత్. తన మొదటి సినిమాతోనే బోల్డ్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. తెలుగు, తమిళ్ వంటి సినిమాలలో నటిస్తోంది. ఇవే కాకుండా పలు భాషలలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ క్రేజ్ మాత్రం భారీగానే పేరు సంపాదించుకుంది .సినిమాలలో హాటుగా కనిపిస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

Payal Rajput looks beautiful in a cream silk saree! | Fashionworldhub

ఇంస్టాగ్రామ్ లో కూడా ఎప్పటికప్పుడు తన ఫోటోలు వీడియోలతో అంతకుమించి అనేలా కనిపిస్తూ ఉంటుంది. అయితే సడన్గా ఇప్పుడు తనకు హెల్త్ ప్రాబ్లం ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది అందుకు సంబంధించిన రెండు ఫోటోలు సైతం షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో తన చేతికి సూది గుచ్చు ఉన్న సెలైన్ ఎక్కించుకున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. అయితే ఈమె సమస్య గురించి తెలుసుకొని అభిమానులు పర్వాలేదులే తగ్గిపోతుంది అంటూ భరోసా ఇస్తున్నారు.

నా వరకు అయితే నేను చాలా తక్కువగా మీరు తాగేదాన్ని.. దీంతో కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది ఫలితంగా అనారోగ్యం బారిన పడ్డాను.. ప్రస్తుతానికి చికిత్స తీసుకుంటున్నాను యాంటీబయోటిక్స్ చివరి డోస్ తీసుకున్నాను మళ్ళీ కెరియర్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను.. అడ్డంకులు ఉన్నప్పటికీ వాటిని అధికమించాలి తన కొత్త ప్రాజెక్టు కోసం షూటింగ్ అని ఆపలేకపోయాను ఈసారి ఇంతకుముందు కంటే షో అద్భుతంగా ఉంటుంది అంటూ తెలుపుతోంది పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.