అలీపై నోరు జారిన బ్రహ్మానందం.. అంత మాటనేసాడు ఏంటి..

వెండితెరపై కామెడీ అనగానే అందరికీ గుర్తు వచ్చే పేర్లు బ్రహ్మానందం, అలీ. ఇద్దరు సమఉజ్జిలు అని స్వయంగా బ్రహ్మానందమే ఒప్పుకున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఒక సినిమా ఫంక్షన్ కి హాజరయ్యారు. అక్కడ డైరెక్టర్ ఎస్వీ కృష్ణ రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి కూడా ఉన్నారు. వారందరూ సినిమా గురించి స్టేజ్‌పై మాట్లాడిన తరువాత చివర్లో బ్రహ్మానందంకి మాట్లాడానికి అవకాశం ఇచ్చారు. వెంటనే మైక్ తీసుకుంటూ ‘టీ షర్ట్ వేసుకోగానే కుర్రాడు అయ్యిపోరు, ముసలాడే’ అంటూ అలీపై సెటైర్ వేస్తాడు. అందరిముందు అలా అనేసరికి అలీ కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతాడు.

బ్రహ్మానందం గురించి మాట్లాడుకుంటే ఆయన పేరుకి తగ్గటే ఎప్పుడు ఎదుటివారికి ఆనందని అందిస్తూ ఉంటారు. దాదాపు ముపైఏళ్లుగా తన కామెడీతో ప్రేక్షకులకు అల్లరిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా కొన్ని సినిమాలో కనిపిస్తూనే ఉన్నారు. అయితే బ్రహ్మీ ఒకప్పుడు సినిమాలో తప్ప బయట కనిపించడం చాలా అరుదు. కానీ ఇప్పుడు మాత్రం కొన్ని ప్రోగ్రామ్స్ కి హాజరవుతూ ప్రేక్షకులకు టచ్ లో ఉంటున్నాడు. సినిమాలో లానే ప్రోగ్రామ్ లో కూడా ఆయన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మానందం మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా నిలిచాయి.

ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘పెద్దవాళ్ళకి, మీడియా మిత్రులకి నా నమస్కారం. అప్పటికీ, ఇప్పటికీ అవే ఫేస్‌లు కానీ జుట్టు మాత్రమే నెరిసింది. తలకి రంగేసావు కానీ మనం కూడా అదే బాపతి’ అంటూ అలీని చూస్తూ అనడంతో అంతా ఒక్కసారిగా నవ్వేశారు. దాంతో అలీ కాస్త చిన్నబుచుకున్నట్లు అర్ధం అవుతుంది. ఇక వెంటనే ఆ మాటలను కవర్ చేస్తూ ‘అలీ ది, నాది ఒకటే జీవితం అనుకోవచ్చు. ఇద్దరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీల నుంచే వచ్చాం. కష్టం, ఆకలి తెలిసినవాళ్లం. అందుకే ఆలీ అంటే ఎంతో నాకు అభిమానం. ఆ అభిమానంతోటే ఇలా ఇప్పటికీ కలిసున్నాం’ అని బ్రహ్మానందం అన్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.