ఆ వ్య‌క్తి వ‌ల్లే పేరు మార్చుకున్నా.. సంయుక్త చిరున‌వ్వు వెన‌క ఇంత వేద‌న ఉందా?

సంయుక్త మీన‌న్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పాప్‌కార్న్` అనే మ‌ల‌యాళ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే న‌టిగా తానేంటో నిరూపించుకుంది. ఆ త‌ర్వాత మ‌ల‌యాళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ `కలరి` సినిమాతో తమిళ సినీరంగానికి పరిచయమైంది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ `భీమ్లా నాయక్`తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ వెంట‌నే `బింబిసార`తో మ‌రో హిట్ అందుకున్న సంయుక్త‌.. ఇప్పుడు `సార్‌(త‌మిళంలో వాతి)`తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైంది. ధ‌నుష్ హీరోగా వెంకీ అట్లూరి తెర‌కెక్కించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 17న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సంయుక్త‌.. వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం పంచుకుంది. త‌న చిరున‌వ్వు వెన‌క ఎంత వేద‌న ఉందో వివ‌రించింది.

కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పేరును సంయుక్త మార్చింది. తన పేరు పక్కనున్న ‘మీనన్’ ను తొలగించింది. ఈ విష‌యంపై తాజాగా ఆమె స్పందించింది. సంయుక్త తల్లి.. తండ్రి నుంచి విడిపోయారు. అయితే `నాన్న ఇంటి పేరుని కొనసాగించకూడదని అమ్మ భావించింది. అందువల్ల అమ్మ అభిప్రాయాన్ని గౌరవించాలని భావించి నా పేరు పక్కన ఉన్న ఇంటి పేరుని తొలగించాను. పైగా ప్రేమ, సమానవత్వం, మానవత్వం కోరుకున్నప్పుడు నాకు నా ఇంటిపేరు అడ్డుస్తోందని అనిపిస్తోంది.` అంటూ సంయుక్త చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఇక‌పై త‌న‌ను అంద‌రూ సంయుక్తి అనే పిల‌వాల‌ని సూచించింది.