ఈ బాలీవుడ్ కొత్తజంట ఆస్తులు విలువ అన్ని వేల కోట్లా.. అంబానీలు కూడా పనికిరారుగా..!!

బాలీవుడ్ ప్రేమ జంట కియారా అద్వాని- సిద్ధార్థ మల్హోత్ర రీసెంట్గా పెళ్లి బంధంతో ఒకటయ్యారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఫైనల్ గా ఈ నెల 7వ తేదీన వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఏవైనా రెండు బడా కంపెనీలు ఒకటైనప్పుడు ఆటోమేటిక్గా వారి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే ఇప్పుడు ఇద్దరు స్టార్లు ఒకటైనప్పుడు వారి ఆస్తి విలువ కూడా రెట్టింపు అయింది.

ఇప్పుడు ఇదే విషయం ఈ కొత్త జంట విషయంలో కూడా జరిగింది. ఇక సిద్ధార్థ మల్హోత్ర- కియారా పెళ్లి చేసుకోవడంతో వీళ్ళిద్దరి ఉమ్మడి ఆస్తి ఇప్పుడు భారీగా పెరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు వారి ఆస్తి విలువ ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు సిద్ధార్థ మల్హోత్రా. ఈ యంగ్ హీరో తన లుక్స్ తో యూత్ లో పిచ్చ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇండియాలో ఉన్న టాప్ బ్రాండ్స్ అన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ గా సిద్ధార్థ కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు. తాను చేసే ఒక్కో యాడికి రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.

ఇక సినిమాలు విషయానికి వస్తే తాను నటించే ఒక్కో సినిమాకు రూ.7 నుంచి రూ.10 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. ఈ రకంగా సిద్ధార్థ మల్హోత్రా నేల సంపాదన చూస్తే కోటి నుంచి కోటిన్నర పై మాటే. దీనికి తోడు తనకి వారసత్వంగా వచ్చిన ఆస్తుల విలువ కూడా భారీ రేంజ్ లోనే ఉంది. అలాగే ముంబైలో సిద్ధార్థ మల్హోత్రా కి ఎంతో ఖరీదైన విలాసవంతమైన ఫ్లాట్లు కూడా ఉన్నాయి. ఈ ఫ్లాట్ తోపాటు రెండు బెంజ్ కార్లు, మూడు కోట్ల విలువచేసే రేంజ్ రోవర్ కార్‌ కూడా ఆయనన దగ్గర ఉంది.

Kiara Advani and Sidharth Malhotra get hitched; first pictures of newlyweds  are out! | Hindi Movie News - Bollywood - Times of India

బాలీవుడ్ బ్యూటీ కియారా ఆస్తి విషయానికి వస్తే.. ఈమె తాను నటించే ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. మరోవైపు యాడ్స్ ద్వారా కూడా మారో రూ.5 కోట్లకు పైగా పారితోషకం అందుకుంటుంది. వీటితోపాటు సోషల్ మీడియా ద్వారా కూడా డిజిటల్ మనీ సంపాదిస్తుంది. ఇక ఈమె ఆస్తి విషయానికి వస్తే ముంబైలో రూ.15 కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్ ఒకటి ఉంది.ప్రస్తుత ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకునీ ఒకటైంది కాబట్టి.. వీరిద్దరికీ కలిపి నెలకు మూడు కోట్లకు పైగా సంపాదన వస్తుంది. దీంతో ప్రస్తుతం వీరి ఆస్తి విలువ రూ.130 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తుంది. వీరిద్దరి సంపాదన సంవత్సరానికి 21% పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.ఈ రకంగా వీరిద్దరూ బాలీవుడ్ లోనే అత్యంత రిచ్చెస్ట్ కపుల్స్ జాబితాలో చేరిపోయారు.