గజినీ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన స్టార్ వీళ్లే..!!

డైరెక్టర్ మురగదాస్ హీరో సూర్య కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం గజినీ .ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారానే హీరో సూర్యకి తెలుగులో మంచి క్రేజ్ లభించేందని చెప్పవచ్చు. ఈ సినిమాతో ఆసిన్ కూడా తెలుగులో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. నయనతారకు కూడా ఈ సినిమా తర్వాతే తెలుగులో వరుస సినిమాలు చేసే అవకాశం లభించింది. అయితే ఆ సంవత్సరం డబ్బింగ్ సినిమాలు ఎన్నో విడుదలైనప్పటికీ ఈ సినిమాకి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిందని చెప్పవచ్చు.

Tuesday Trivia: Did you know Chiyaan Vikram lent his voice to Ajith Kumar  in these debut films?
ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా డైరెక్టర్ మురగదాస్ మొదట ఈ సినిమా స్టోరీని హీరో అజిత్ కి చెప్పారట.. అయితే అప్పుడు ఉన్న అజిత్ ఇమేజ్ కి సరిపడాయి కదా అని భావించి అజిత్ సినిమాని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. విక్రమ్ కు ఈ సినిమా కథ చెప్పగా విక్రమ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న అపరిచితుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల తన డేట్లు అడ్జస్ట్ కాక ఈ సినిమాలో నటించలేదట. మరొక నటుడు సూర్యాకు ఈ సినిమా కథ చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది.

Ghajini Photos: HD Images, Pictures, Stills, First Look Posters of Ghajini  Movie - FilmiBeatఇక ఈ చిత్రంలో సూర్య అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఇందులో సూర్య 2 షడ్స్ ఉన్న పాత్రలలో నటించి అందరిని ఆకట్టుకున్నారు. మొదట సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోల రేంజ్ ను దక్కించుకున్న సూర్య.. ఆ తరువాత ఎన్నో ప్రయోగ సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఈ సినిమాని విక్రమ్, అజిత్ వంటి వారు రిజెక్ట్ చేయడంవల్లి సూర్యకు ఇంతటి స్టార్రడం వచ్చిందని చెప్పవచ్చు.