మళ్లీ బయటపడ్డ తమన్నా లవ్ మ్యాటర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో చిత్రాలను నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.ప్రస్తుతం అడపా దడపా సినిమాలలో నటిస్తున్న పెద్దగా సక్సెస్ కాలేక పోతోంది. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలలో తమన్నా మరొక నటుడు విజయ్ వర్మ తో రొమాన్స్ వీడియో బయటపడడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఆ తర్వాత కూడా ఈ జంట ఒకటి రెండు సార్లు బయట కనిపించడంతో వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందనే రూమర్స్ కూడా వినిపించాయి.

Vijay-Tamanna: Did Vijay Verma declare his love with Tamannaah Bhatia? A  picture created ruckus on

అయితే నిన్నటి రోజున ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విజయ్ వర్మ ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టులో తమన్నా రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటిస్తారని అందరూ భావించారు.. కానీ అలా జరగకుండా కేవలం ఇంస్టాగ్రామ్ లో ఒక పిక్ షేర్ చేసి విజయ్ ఫేస్ కనిపించకుండా చాలా జాగ్రత్త పడుతూ అభిమానులకు ఒక పరీక్ష పెట్టాడు. అయితే అందులో తమన్నాదే ఫొటో అన్నట్లుగా ఆ ఫోటోని తేల్చడం జరిగింది నేటిజన్స్.

Vijay Verma Celebrates Valentines Day With Tamannaah Bhatia Posted Photo  With Lady Love | Vijay Verma ने Tamannaah Bhatia के साथ सेलिब्रेट किया  वैलेंटाइन्स डे, सामने आई ये खूबसूरत तस्वीर

అసలు విషయంలోకి వెళ్తే.. విజయ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో రెడ్ హార్ట్ ఎమోజితో ఉన్న ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. ఇందులో రెండు జతల పాదాలు ఒకదానితో ఒకటి ఎదురుగా ఉండేలా కనిపిస్తున్నాయి కానీ ముఖాలు మాత్రం రివీల్ చేయలేదు. ఇక అందులో కనిపిస్తున్న మరొక జత పాదాలు తమన్నా వే అని క్లారిటీ ఇవ్వడం జరిగింది ప్రేక్షకులు. ఎందుకంటే తమన్నా జాకెట్ కనిపించింది.. కానీ ఆ జాకెట్ తమన్నా దేనిని గ్యారెంటీ లేదు కదా అని సందేహం రావచ్చు.. అయితే తమన్నకు సంబంధించి ఒక ఫోటో వెతికి మరి పోస్ట్ చేశారు ఈ రెండు ఫోటోలు కంపేర్ చేస్తే కచ్చితంగా వీరిద్దరూ లవ్ లో ఉన్నట్లే అని కన్ఫామ్ చేస్తున్నారు.