తారక్ ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. మళ్లీ అలాంటి పాత్రలో ఎన్టీఆర్..!!

 

నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వయసు 39 సంవత్సరాలు నిండి త్వరలోనే 40 ఏళ్లలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్బంగా ఈ నెల 24వ తేదీన ఆయన కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నారని సమాచారం. ఒక ఆరేడు నెలలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

చాలా ఏళ్ల తరువాత ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ డబుల్ రోల్ చేయడం కొత్తేమీ కాదు. కానీ ప్రస్తుతం ఈ కొత్త సినిమాలో మాత్రం తారక్ తండ్రికొడుకుల పాత్రల్లో నటించబోతున్నారట. అయితే ఈ వార్త విన్న ఎన్టీఆర్ అభిమానులు చాలా టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఆంధ్రావాలా, శక్తి సినిమాలలో కూడా తండ్రీకొడుకు క్యారెక్టర్స్ లో నటించాడు. ఆ రెండు సినిమా లు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి.

ప్రస్తుతం తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్న సినిమా లో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ లేదా మృనాల్ ఠాగూర్ నటిస్తారని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి మరి. ఈ సినిమా రివేంజ్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. అయితే ఎన్టీఆర్ ఉహించిన ఫలితాన్ని ఈ సినిమా ఇస్తుందా లేదా అనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సిందే. ఇక తారక్ మాత్రం ఈ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమా లో మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. కొరటాల శివ ఈ సినిమా ని అద్భుతంగా చిత్రికరిస్తునారట. 2024 ఏప్రిల్ 5 నా ఎన్టీఆర్ 30 సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు వున్నాయి.