మొట్టమొదట కోటి రూపాయలు అందుకున్న లేడీస్ సూపర్ స్టార్ ఈమె..!!

తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీని నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన.. తన నటనతో అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా మహిళ సాధికారిక నేపథ్యంలో కూడా ఈమె పలు చిత్రాలలో నటించింది. తెలుగులో అలాంటి సినిమాలకు విజయశాంతి కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పవచ్చు. ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సూపర్ క్రేజ్ అందుకుంది.

Tollywood: Too many demands from Vijayashanti?
మొదట డైరెక్టర్ భారతి రాజా సినిమాలో అనుకోకుండా అవకాశం రావడంతో మొదటి సినిమా చేసిన విజయశాంతికి రెమ్యూనరేషన్ కింద రూ.5000 ఫిక్స్ చేయగా.. కేవలం రూ .3000 ఇచ్చిరూ .2000 ఎగ్గొట్టారని ఆమె చెప్పడం గమనార్హం. సినీ పరిశ్రమలో ఎవరు ఎవరి కోసం ఏమీ చేయారని పరిశ్రమలోనే కాకుండా నిజజీవితంలో కూడా ఎవరి కోసం ఎవరు ఏమి చేయారని తమ కోసం తాము నిలబడాలని తెలియజేసింది విజయశాంతి. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో పెళ్లి కూడా తానే చేసుకోవలసి వచ్చింది అని తెలిపింది.

మొదటిసారిరూ .3000 రెమ్యూనరేషన్ రాగా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు కోటి అందుకున్న రెమ్యూనరేషన్ ఏకైక తెలుగు హీరోయిన్ తనే అని చెప్పుకొచ్చింది. అప్పట్లో ఇండియా టుడే లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో అమితాబ్ ,రజనీకాంత్, విజయశాంతి పేర్లు వచ్చాయని తెలిపింది. తన భర్త తనకు సపోర్టుగా నిలుస్తూ వచ్చారని సినిమాలలో రాజకీయాలలో ఉన్న తాను చేసేది చేసుకుంటూ వెళ్లాలని ఎవరికీ భయపడేది లేదని తెలిపింది విజయశాంతి. ముఖ్యంగా మహిళలు అందరూ కూడా అలాగే ఉండాలని డిప్రెషన్ కు వెళ్లాల్సిన పనిలేదని తెలిపింది.