మళ్లీ దొరికేసిన రష్మిక- విజయ్ దేవరకొండ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉన్నట్లు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వీరిద్దరూ మాత్రం కేవలం మేము స్నేహితులము అంటూ తెలియజేస్తూ ఉన్నారు. ఇటీవల విదేశాల లొకేషన్స్ కు కలిసి వెళ్లారని అక్కడి నుంచి లికులు ఇగో అంటూ పలు ఆధారాలు కూడా పలువురు నేటిజెన్లు సైతం సృష్టించడంతో వీరి మధ్య పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Vijay – Rashmika : Vijay Deverakonda, Rashmika in Dubai Tour.. Photo Viral!

ఇప్పుడు మరొకసారి విజయ్ దేవరకొండ ,రష్మిక కలిసి దుబాయిలో షికార్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. తన కుటుంబంతో దుబాయ్ వెకేషన్ కి వెళ్తున్న విజయ్ దేవరకొండ రష్మిక కూడా వారితో జాయిన్ అయిపోయింది అంటూ ప్రచారం వినిపిస్తోంది. అయితే తామిద్దరం డేటింగ్ చేయలేదని కేవలం స్నేహితులము అంటూ తెలియజేస్తున్నారు. విజయ్ ,రష్మిక ఇద్దరూ కెరియర్ పరంగా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. ఈ మధ్యన లైగర్ సినిమా తో భారీ డిజాస్టర్ ని అందుకున్నారు విజయ్ దేవరకొండ. ఇక రష్మిక కూడా బాలీవుడ్లో పలు చిత్రాలలో నటించగా ఫ్లాప్గానే మిగిలాయి.

Vijay Devarakonda and Rashmika Mandanna drop similar vacation pictures on  social media; albeit months apart | Kannada Movie News - Times of India

ప్రస్తుతం ఈమె చేతిలో పుష్ప-2 సినిమాలో మాత్రమే నటిస్తున్నట్లు తెలుస్తోంది ఆ తర్వాత బాలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలని ప్లాన్ వేస్తున్నట్లుగా సమాచారం. ఇక విజయ్ దేవరకొండ చేతుల ప్రస్తుతం ఖుషి సినిమా లో మాత్రమే నటిస్తున్నారు ఆ తర్వాత మరొక పోలీస్ ఆఫీసర్ చిత్ర కథ తో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే రష్మిక విజయ్ దేవరకొండ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ పలు వార్తలు వినిపిస్తున్న వీరు మాత్రం ఈ వార్తలకు ఎప్పుడు కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు.