వెంక‌టేష్ వార్నింగ్ కు రానా రియాక్ష‌న్‌.. సొంత బాబాయ్‌ను అంత మాట‌న్నాడేంటి?

ద‌గ్గుబాటి హీరోలు విక్ట‌రీ వెంక‌టేష్, రానా ద‌గ్గుబాటి క‌లిసి ఓ వెబ్ సిరీస్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అదే `రానా నాయుడు`. క‌ర‌న్ హ‌న్షుమాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సిరీస్ ను లోకోమోటివ్ గ్లోబల్ మీడియా బ్యాన‌ర్ పై సుందర్ ఆరోన్ నిర్మించారు. త్వ‌ర‌లోనే ఈ వెబ్ సిరీస్ ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

అమెరిక‌న్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోనోవ‌న్’ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ వెబ్ సీరిస్ లో వెంకీ, రానా తండ్రి, కొడుకులుగా క‌నిపించ‌బోతున్నారు. అయితే తాజాగా `రానా నాయుడు` టైటిల్ విష‌యంలో వెంకీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం విధిత‌మే. స్టార్ హీరో తానైతే.. రానా రోల్ నేమ్ టైటిల్ గా పెట్టడమేంటి వెంకీ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. నాగా నాయుడు అని టైటిల్ మార్చ‌కుంటే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించి వీడియో ఇప్ప‌టికే నెట్టింట ట్రెండ్ అయింది.

ఇదంతా ప్రమోషన్స్ లో భాగమే అనుకోండి. అయితే వెంక‌టేస్ వార్నింగ్ కు రానా రియాక్ట్ అవుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో `వచ్చాయ్.. ట్రైలర్ లాంఛ్ లో క‌లుద్దాం. అక్క‌డ నీకు గేటు ద‌గ్గ‌ర‌ ఎంట్రీ దొరక్కపోతే రానా నాయుడు తండ్రి అని చెప్పు. నీకు రానా పేరుతో ఎంట్రీ ఇస్తారు` అంటూ రానా కౌంట‌ర్ ఇచ్చాడు. సొంత బాబాయ్‌నే రానా అంత మాట‌న‌డంతో నెటిజ‌న్లు షాకైపోతున్నారు. మొత్తానికి త‌మ `రానా నాయుడు` సిరీస్ పై హైప్ పెంచ‌డానికి బాబాయ్‌, అబ్బాయిలు బాగానే రెచ్చిపోతున్నారు.