బోయపాటి శ్రీను రికార్డును టచ్ కూడా చేయలేకపోతున్న రాజమౌళి.. ఏంటా రికార్డు..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బోయపాటి శ్రీను బాలకృష్ణ రవితేజ అల్లు అర్జున్ వంటి హీరోలతో కలిసి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అయితే తెలుగులో అతని కంటే మరింత సక్సెస్‌ఫుల్ అయిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పవచ్చు. అయితే రాజమౌళి ఇండియన్ మూవీ హిస్టరీ లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు కానీ బోయపాటి శ్రీను సెట్ చేసిన ఒక రికార్డును మాత్రం టచ్ కూడా చేయలేకపోయాడు. వినడానికి ఇది చాలా కష్టంగా అనిపించినా నిజం.

ఇంతకీ అంత గొప్ప రికార్డు ఏమిటా అనే కదా మీ ప్రశ్న.. అదే ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ సినిమాలను యూనిట్ స్టైల్ లో ప్రజెంట్ చేయగల దర్శకుడు బోయపాటి శ్రీను. మాస్‌ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కూడా కురిపించాడు. బోయపాటి శ్రీను బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు యూట్యూబ్‌లోనూ తన సినిమాలతో రికార్డులు తిరగరాశాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా అతడు రూపొందించిన మాస్ యాక్షన్ మూవీ ‘జయ జానకి నాయక’ యూట్యూబ్‌లో 70 కోట్ల వ్యూస్ సంపాదించింది. అయితే ఇది మన తెలుగులో కాదు. ఈ సినిమాని హిందీలో ’జయ జానకి నాయక కూంకార్’ పేరుతో డబ్ చేశారు.

హిందీ ప్రేక్షకులకు ఇది బాగా నచ్చాడంతో ఇప్పటివరకు దీనికి 70 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‌లో టాలీవుడ్ డైరెక్టర్ తీసిన ఏ సినిమా కూడా ఇన్ని వ్యూస్‌ సంపాదించలేదు. రాజమౌళి హిందీ డబ్బుడ్ మూవీలు సైతం యూట్యూబ్‌లో 50 కోట్ల వ్యూస్‌ సాధించలేకపోయాయి. ఆ విధంగా బోయపాటి శ్రీను సెట్ చేసిన రికార్డును రాజమౌళి టచ్ కూడా చేయలేకపోతున్నాడు. ఇకపోతే జయ జానకి నాయక సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.

Share post:

Latest