ఆ హీరో కౌగిట్లో మంచు ల‌క్ష్మి.. సిగ్గుందా అంటూ ఏకేస్తున్న నెటిజ‌న్లు!

అతి చేసి విమ‌ర్శ‌ల పాల‌వ్వ‌డంలో మోహన్ బాబు ముద్దుల తనయ, నటి మంచు ల‌క్ష్మి ఎప్పుడూ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. ఈమె ఏం మాట్లాడినా, ఏ పోస్ట్ పెట్టినా ట్రోల‌ర్స్ బారిన ప‌డుతూనే ఉంటుంది. తాజాగా మ‌రోసారి నెటిజ‌న్లు మంచు ల‌క్ష్మిని ఏకేస్తున్నారు. ఏం జ‌రిగిందంటే.. ఫిబ్రవరి 9న అక్కినేని హీరో సుమంత్ బర్త్ డే.

ఈ సందర్భంగా మంచు ల‌క్ష్మి సోష‌ల్ మీడియా వేదిక‌గా `హ్యాపీ బర్త్ డే డార్లింగ్. ఈ ఏడాది నీకు మంచి జరగాలి` అంటూ ఓ పిక్ షేర్ చేసి సుమంత్ కు విషెస్ తెలిపింది. సుమంత్‌ కౌగిట్లో ఉన్న మంచు ల‌క్ష్మి చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపించింది. ఆ ఫొటోలో చెప్పుకోవాల్సినంత మేటర్ లేదు. కానీ, కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం పెళ్లి అయిన మంచు ల‌క్ష్మి పరాయి వ్యక్తితో అంత సన్నిహితంగా ఉండ‌టాన్ని త‌ప్పుబ‌డుతున్నారు.

మంచు లక్ష్మి సుమంత్ ని కౌగిలించుకొని ఫోటో దిగ‌డంతో పాటు డార్లింగ్ అంటూ రొమాంటిక్ పదం వాడింది. దీంతో సిగ్గుందా అంటూ మంచు ల‌క్ష్మిని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏకేస్తున్నారు. మోహన్ బాబు గారు ఎప్పుడూ డిసిప్లిన్ అంటారు. ఇలాగే ఉంటదా డిసిప్లిన్, మీ లాంటి వల్లే భారతీయ సంస్కృతి పాడైపోయేది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఇటువంటి ట్రోల్స్ ను మంచు ల‌క్ష్మి అస్స‌లు ప‌ట్టించుకోదు. పిచ్చ లైట్ తీసుకుని త‌న ప‌ని తాను చూసుకుంటుంది.

https://twitter.com/LakshmiManchu/status/1623525127676903426?s=20&t=OOBevRTVrDQw0XhYY-mXxw