అందాల ఆర‌బోతలో బౌండ‌రీలు చెరిపేస్తున్న కృతి శెట్టి.. తాజా పిక్స్ చూస్తే చెమ‌ట‌లే!

ఉప్పెన సినిమాతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల సోయగం కృతి సనన్.. కెరీర్‌ ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్స్ అందుకుని యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఆ క్రేజ్ ఎక్కువ కాలం నిలవలేదు.

బ్రేకులు లేని హిట్స్ తో దూసుకెళ్తున్న కృతి శెట్టికి గ‌త‌ ఏడాది వరుసగా మూడు ఫ్లాపులు పడ్డాయి. దీంతో గోల్డెన్ లెగ్ అంటూ పొగడ్తలు కురిపించిన వారే ఆమెపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కృతి శెట్టి తెలుగులో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యకు జోడిగా `కస్టడీ` అనే మూవీలో నటిస్తోంది.

తెలుగులో ఈ ప్రాజెక్టు మాత్రమే కృతి శెట్టి చేతిలో ఉంది. అలాగే తమిళంలో ఒక సినిమా, మలయాళం లో ఒక సినిమా చేస్తోంది. ఆఫర్లు అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో కృతి గ్లామర్ షో ద్వారా ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటోషూట్లతో నెటిజ‌న్ల‌ను ఆగమాగం చేస్తోంది.

వెండితెరపై ఇంతవరకు ఎంతో పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి.. నెట్టింట మాత్రం అందాల ఆరబోతలో బౌండరీలు చెరిపేస్తూ కుర్ర‌కారు గుండెల్లో మంటలు రేపుతోంది. తాజాగా మరోసారి తన అందాలతో ఎట్రాక్ట్‌ చేసే ప్రయత్నం చేసింది.

ట్రెండీ దుస్తుల్లో అందంగా ముస్తాబై దర్శనమిచ్చింది. నాజూకు నడుముతో ఒంపులు పోతూ సోకుల విందు చేసింది. కృతి శెట్టి తాజా ఫోటోలు చూస్తే చెమటలు పట్టాల్సిందే. అంత హాట్ గా కృతి దర్శనం ఇచ్చింది.