సినిమా లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. జియో నుంచి కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్!

ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో ఏ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కి సబ్‌స్క్రైబ్ చేస్తే బాగుంటుందా అని ప్రేక్షకులు అయోమయంలో పడిపోతున్నారు. తక్కువ ధర ఉంది కదా అని అమెజాన్ ప్రైమ్ తీసుకుంటే, నెట్‌ఫిక్స్ రిలీజ్ అయ్యే కొత్త సినిమా పేరు వింటుంటే మతి పోతుంది. అలా కాదులే అని ఆహా తో ప్రొసీడ్ అవుదాం అంటే 4కేలో ఇంకో మూడు వందలు ఎక్కువ అని అక్కడ డిసప్పాయింట్ చేస్తున్నారు. ఇక క్రికెట్ ప్రేమికులకి హాట్ స్టార్ తప్పనిసరి. కొత్త వెబ్ సిరీస్ లు చూడాలంటే సోనీ లివ్ కి సబ్‌స్క్రైబ్ చేయాల్సిందే. అయితే ఆప్షన్స్ అందుబాటులో ఉండటం వల్ల ప్రేక్షకులు తమకు బాగా సూట్ అయ్యే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కి సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు.

కాగా ఈ నేపథ్యంలోనే రిలయన్స్ సంస్థ కొత్త ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ తీసుకురాబోతున్నారట. ఆల్రెడీ ముఖేష్ అంబానీకి జియో సినిమాలు అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఉంది. ఆ యాప్ లో సన్ నెక్స్ట్ కంటెంట్ కూడా షేర్ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య దాన్ని విత్ డ్రా చేసుకున్నారు. ముఖేశ్ అంబానీ ఈమధ్య వయాకామ్ 18 స్టూడియోస్ ని కొన్నారు. ఇక వాళ్ళ వుట్ సెలెక్ట్ ప్లాట్ ఫామ్ లో చాలా కంటెంట్ ఉంది, కానీ అది ప్రేక్షకులకు పెద్దగా మెప్పించలేకపోతుంది. అందుకే వీటన్నీటిని కలిపి జియో వూట్ పేరుతో త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

నిజానికి 4జీలో జియో ఎటువంటి రివాల్యూషన్ తీసుకొచ్చిందో ఇప్పుడు కూడా అలానే ఓటీటీలో మార్పు తెచే ప్రయత్నం చేస్తుంది. రాబోయే జియో వూట్ కోసం విక్రమ్ వేద, డిజిటల్ ప్రీమియం చేయలేదు. అలానే సౌత్, నార్త్ సినిమా లు కూడా కొన్ని జియో వూట్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ ప్లాన్ అందరికి అందుబాటు ధరల్లోనే ఉంటాయని సమాచారం. దీనివల్ల మంచి కంటెంట్ చూసి ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.