దిల్ రాజు స్కెచ్ మామ్మూలుగా లేదు… ఏకంగా హెడ్ అయిపోదామని చూస్తున్నాడు?

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల నిర్మాణమే చాలా రిస్కీ బిజినెస్. అలాంటి వ్యాపారాన్ని సజావుగా సాగించడంలో దిల్ రాజు మంచి దిట్ట. అతను ఎలాంటి సినిమా చేసినా మినిమమ్ గ్యారంటీ అని ఓ నానుడి. టాలీవుడ్లో చిన్న చిన్న హీరోలనుండి పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేసాడు దిల్ రాజు. అలాంటి దిల్ రాజు నిర్మాతల మండలి ప్రెసిడెంట్‌ కావాలనుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ ఫిల్మ్ వర్గాలు.

అవును, ఆయన త్వరలో జరగబోయే ప్రొడ్యూసర్ల కౌన్సిల్ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసినట్లు తాజాగా వార్తలు గుప్పుమన్నాయి. గత 2 రోజుల నుంచి సదరు వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. మరో నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ వార్తల్లో భాగమయ్యారు. అయితే ఊహాగానాలు మాత్రం దిల్ రాజు చుట్టూనే తిరగడం విశేషం. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నామినేట్ వేశారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆయన యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్‌‌లో క్రియాశీలకంగా ఉన్నారనే విషయం విదితమే.

కాగా ఇప్పుడు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌కు పోటీ పడటం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. భారత్‌లో ఏర్పాటైన ఏ సంఘానికైనా కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసినదే. ఇక్కడ అధ్యక్షుడిని ఎన్నికల ద్వారా మాత్రమే ఎంచుకోవాలి. త్వరలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యుసర్ల కౌన్సిల్ అధ్యక్ష పదవీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దిల్ రాజుతో సహా గిల్డ్ సభ్యులు స్రవంతి రవికిషోర్, దామోదర ప్రసాద్ తదితరులు నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. అయితే వీరిలో ఎవరు గెలిచినా.. అది నిర్మాతల మండలి, గిల్డ్ రెండింటికీ నాయకత్వం వహించేలా చేస్తుంది. మరోపక్క నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కావడానికి ఇప్పటికే అవసరమైన ఓట్లను దిల్ రాజు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి.