అనుష్క‌ ప్రేమ పాఠాలు.. అభిమానులంతా అదే ప్ర‌శ్న!

నేడు వాలెంటేన్స్ డే అన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సినీ తార‌లు త‌మ ప్రియ‌మైన వారితో పాటు అభిమానుల‌కు వాలెంటేన్స్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే మ‌న టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రేమ పాఠాలు వ‌ల్లించింది. ప్రేమ గురించి చెబుతూ ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది.

`ప్రేమకి సంబంధించిన అన్ని రూపాలకు చిన్న తేడాతో విభిన్న మార్గాలుంటాయి. ఒకటి మీ హృదయానికి వెచ్చదనం ఇచ్చేదిగా, మరొకటి మా మార్గాలను మార్చేదిగా, ఇంకోటి మిమ్మల్ని మీతో ప్రేమలో పడేసేదిగా ఉంటుంది. మనందరం ఓ ప్రత్యేకమైన పద్ధతిలో ప్రేమని ఇవ్వడం తీసుకోవడం చేస్తుంటాం. ఇదంతా మనకు దక్కిన ఆశీర్వాదం. ఈ క్షణంలో మనం ఎక్కడ ఉన్నా అక్కడ కొంత ప్రేమ, అనుభూతిని పొందాలి. అది ఈ రోజు, ప్రతి రోజూ కూడా. ఇప్పటికీ, ఎప్పటికీ మీ అందరి ప్రేమకి ధన్యవాదాలు` అంటూ అనుష్క ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.

దీంతో అభిమానులంతా ఒక‌టే ప్ర‌శ్న‌.. `పెళ్లెప్పుడు..?` అని. పెళ్లి గురించి ప్ర‌శ్నిస్తూ కామెంట్ బాక్స్ ను నింపేశారు. కొంద‌రైతే ఇప్ప‌టికేనా ప్ర‌భాస్ ను పెళ్లి చేసుకో అంటూ స‌ల‌హా ఇస్తున్నారు. కానీ, అనుష్క మాత్రం నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ పెళ్లి ఊసే ఎత్త‌కుండా ఫ్యాన్స్ ను నిరుత్సాహానికి గురి చేస్తోంది. సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈ అమ్మ‌డు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో మ‌హేష్. పి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోంది. `మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి` అనే టైటిల్ ని ఈ మూవీకి పరిశీల‌నలో ఉంది.